- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral: బాల్కనీలో ఇరుక్కుపోయిన యువకులు.. డెలివరీ బాయ్ సాయంతో బయటపడ్డారు.. ఎలాగంటే..?
మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకున్న ఓ వినూత్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకున్న ఓ వినూత్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్ధరాత్రి సమయంలో ఇంటి బాల్కనీలో పొరపాటున ఇరుక్కుపోయిన ఇద్దరు యువకులు, అత్యవసర పరిస్థితిలో డెలివరీ యాప్‌ను వినియోగించి సురక్షితంగా బయటపడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుణేకు చెందిన మిహిర్ గహుకర్ అనే యువకుడు, అతని స్నేహితుడు అర్ధరాత్రి తమ ఇంటి బాల్కనీ లోకి వెళ్లారు. అయితే అనుకోకుండా బాల్కనీ డోర్లు లాక్ అయి, వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో వారి తల్లిదండ్రులు నిద్రలో ఉండడంతో, వారిని లేపకుండా సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నారు.
ఒక వినూత్న ఆలోచన
ఈ క్రమంలో వారికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. అర్ధరాత్రి కూడా అందుబాటులో ఉండే డెలివరీ సేవలను వినియోగించుకోవాలని భావించి, వెంటనే బ్లింకిట్ యాప్‌లో ఒక ఆర్డర్ పెట్టారు. కొద్దిసేపటికే డెలివరీ ఏజెంట్ వారి ఇంటికి చేరుకున్నాడు. బాల్కనీలో ఉన్న యువకులు ఫోన్ ద్వారా తమ పరిస్థితిని అతడికి వివరించారు. యువకులు చెప్పిన సూచనల మేరకు ఇంటి మెయిన్ డోర్ కీ ఎక్కడ ఉందో తెలుసుకున్న డెలివరీ ఏజెంట్, ఆ కీతో డోర్ అన్‌లాక్ చేసి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం పైకి వెళ్లి బాల్కనీ డోర్లు తెరిచి యువకులను బయటకు తీసుకొచ్చాడు. ఈ ఘటన మొత్తాన్ని యువకులు వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది. అర్ధరాత్రి సమయంలో డెలివరీకి వచ్చి మానవతా దృక్పథంతో సాయం చేసిన డెలివరీ ఏజెంట్‌కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే యువకుల వినూత్న ఆలోచనపై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






