శవం అనుకున్నాం కదరా.. ఇవేం స్టంట్స్‌రా బాబు(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-01 14:38:07  IST  )

ఛత్తీస్‌గఢ్‌ బిజాపూర్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రీల్స్ కోసం యువకులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా హై స్పీడ్‌లో నడుపుతూ..

శవం అనుకున్నాం కదరా.. ఇవేం స్టంట్స్‌రా బాబు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌ బిజాపూర్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రీల్స్ కోసం యువకులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా హై స్పీడ్‌లో నడుపుతూ.. నలుగురు స్కూటీపై కూర్చుని.. ఐదో వ్యక్తిని గాల్లో ఎత్తుకున్నారు. ఓల్డ్ పెట్రోల్ పంప్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి స్టంట్స్ చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందని ఫైర్ అయ్యారు. ఇక ఈ క్లిపింగ్‌పై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ‘చిన్న తప్పిదం జరిగినా శవాలు లేస్తాయి’, ‘ముందు శవం అనుకున్నారా బాబు’, ‘ బాగుంది.. చాలా బాగుంది’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. సూసైడ్ స్టంట్ అని విమర్శించిన కొందరు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story