దేశంలో యువత మరీ ఇంత ఖాళీగా ఉన్నారా? షాకింగ్ వీడియో వైరల్!

by Ajay Maddhiboyina |

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది అనేది కాద‌న‌లేద‌ని స‌త్యం. చ‌దువు పూర్తి చేసినా ఉద్యోగం లేక చాలా మంది య‌వుత కాళీగా ఉంటున్నారు.

దేశంలో యువత మరీ ఇంత ఖాళీగా ఉన్నారా? షాకింగ్ వీడియో వైరల్!
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది అనేది కాద‌న‌లేద‌ని స‌త్యం. చ‌దువు పూర్తి చేసినా ఉద్యోగం లేక చాలా మంది య‌వుత కాళీగా ఉంటున్నారు. ఉద్యోగాలు లేక వ్యాపారం చేయ‌డానికి డ‌బ్బులు లేక ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో ఎక్కువ మంది ఏం చేయాలో అర్థం కాక సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బు సంపాదించాల‌ని అనుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలు చేస్తే డ‌బ్బులు వస్తాయ‌ని తెలియ‌డంతో ప్ర‌తిఒక్క‌రూ అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోల‌తో ల‌క్ష‌లు కోట్లు సంపాదించ‌వ‌చ్చు అనే థంబ్ నెయిల్స్ క‌నిపించ‌డంతో ఫోన్ ఉంటే చాలు క్రియేట‌ర్లుగా మారిపోతున్నారు.

తాజాగా దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య ఎలా ఉంది. ఉద్యోగం లేక ఏ స్థాయిలో యూట్యూబ‌ర్లుగా మారుతున్నారు అని చెప్పే వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. వీడియోలో ట్రైన్ దిగిన వెంట‌నే క్రియేట‌ర్లు అంతా ఫోన్లు, కెమెరాల‌తో వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. అది కొత్త‌గా ప్రారంభించిన ఏసీ లోక‌ల్ ట్రైన్ కావ‌డంతో వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. అయితే ఒకే చోట అంత‌మంది ఫుల్ బిజీగా వీడియోలు రికార్డ్ చేయ‌డంతో ఇంత కాళీగా ఉన్నారా అంటూ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో హహారాష్ట్ర‌లోని క‌ర్జ‌త్ రైల్వే స్టేష‌న్ లో తీసిన‌ట్టు తెలుస్తోంది. నిరుద్యోగం కార‌ణంగానే ఆదాయం కోసం ఇలా త‌యార‌య్య‌రు అంటూ ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. video

Next Story