Viral video: నీ రీల్స్ పిచ్చి తగలేయ్యా.. అక్కడికి ఎలా వెళ్లావే తల్లి? చెట్టు చివరి అంచులపై డ్యాన్స్!

by Yella Dhawani Reddy |

పిచ్చి పలు రకాలంటారు.

Viral video: నీ రీల్స్ పిచ్చి తగలేయ్యా.. అక్కడికి ఎలా వెళ్లావే తల్లి? చెట్టు చివరి అంచులపై డ్యాన్స్!
X

దిశ, వెబ్ డెస్క్: పిచ్చి పలు రకాలంటారు. అందులో ఇప్పుడు చెప్పబోయే యువతిది ఓ రకం. ఎందుకంటే.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవ్వాలని యువత ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నారో తెలిసిందే. తాజాగా ఓ యువతి కూడా ఎలాగైనా ఫేమస్ అవ్వాలని, తన ఫాలోవర్స్‌ను పెంచుకోవాలని సాహసోపేతమైన రీల్ (Reels) చేసింది. దీనిని చూసిన నెటిజన్లు ఇదేంట్రా బాబు ఇలా ఉందని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ యువతి ఏం రీల్ చేసిందో మీరు కూడా చూసేయండి.

జమ్ము కాశ్మీర్‌ (Jammu Kashmir) లోయలోని ఓ గ్రామానికి చెందిన ఉషనాగ వంశీ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) రీల్స్ చేస్తుంది. అయితే, సాధారణ డ్యాన్స్ వీడియోలు చేస్తే తనకంటూ ప్రత్యేకత ఏముంటుందని అనుకుందేమో.. స్పెషల్‌గా చేయాలని నిర్ణయించుకుంది. ఇక తనకున్న టాలెంట్‌ను ఉపయోగించి గత కొద్దిరోజుల నుంచి చెట్టుపైకి ఎక్కి డ్యాన్సులు చేసి, ఆ వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేయటం చేస్తోంది. ఏ మాత్రం భయం లేకుండా చెట్టు చివరి అంచుల వరకు వెళ్లి నిటారుగా నిలబడి డ్యాన్స్ చేసి వీడియో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా వీక్షించగా.. 30 వేల మంది లైక్ చేశారు. అయితే, దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. వింత వింతగా కామెంట్లు పెడుతున్నారు. 'సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ఇలా ప్రాణాలను పణంగా పెట్టకూడదు' అని పలువురు సూచిస్తుండగా.. 'నేల మీద కంటే ఇంటర్నెట్ నెట్వర్క్ అక్కడే బాగుంటుంది' ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Next Story