- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌తో సహా ట్రాక్‌పై పడిన యువకుడు.. తీసుకునే లోపే దారుణం (VIDEO)
ఓ యువకుడు బైక్ పై ట్రాక్ ను దాటుతూ.. ప్రమాదవశాత్తు పడిపోయాడు. ట్రైన్ వచ్చేస్తుందన్న కంగారులో అతను పైకి లేచి.. తన బైక్ ను తీసుకుని వెళ్లేలోగానే దారుణ ఘటన జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ యువకుడు బైక్ పై ట్రాక్ ను దాటుతూ.. ప్రమాదవశాత్తు పడిపోయాడు. ట్రైన్ వచ్చేస్తుందన్న కంగారులో అతను పైకి లేచి.. తన బైక్ ను తీసుకుని వెళ్లేలోగానే దారుణ ఘటన జరిగింది. ట్రైన్ ఢీ కొని యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బైక్ ను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆలోచనే అతని ప్రాణం తీసింది. దానిని అక్కడే వదిలేసి.. పక్కకు వెళ్లి ఉంటే యువకుడు ప్రాణాలతో ఉండేవాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా జిల్లాలో జరిగింది.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటికి రాగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫుటేజీలో ఉన్న సమయాన్ని బట్టి చూస్తే.. ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. రైలు వేగంగా వస్తుండటాన్ని గమనించిన యువకుడు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసినా ఫలితం దక్కలేదు. నిజానికి రైల్వే ట్రాక్స్ దాటే ప్రాంతాల్లో రైల్వే గేట్లు ఉండాలి. కానీ ఫుటేజీలో అక్కడ రైల్వే గేట్ ఉన్నట్లు కనిపించలేదు. ప్రమాదంలో యువకుడు మరణించడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. కాగా.. యువకుడికి వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే దారుణం జరిగిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






