- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: ఇదేం జాబ్ రా నాయనా.. మెంటల్ టెన్షన్ కు సర్కార్ జాబ్ వదిలేసిన యువతి (వీడియో)
ఈ టెన్షన్ నేను భరించలేనంటూ సర్కార్ జాబ్ కు ఓయువతి రాం రాం చెప్పేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు (Government job) ఆదరణ ఉంది. సర్కార్ కొలువు సాధించాలనేది చాలా మంది కల. గవర్నమెంట్ ఉద్యోగం సాధించేందుకు చాలా మంది ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో ఎంతో మంది ఈ అచీవ్ మెంట్ సాధించకుండానే నిరాశతో మిగిలిపోతే కొద్ది మంది మాత్రమే ఈ ఫీట్ సాధిస్తారు. అలాంటి వారిని సమాజంలో చాలా మంది అదృష్టవంతులు అని చెప్పుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఇందుకు విరుద్ధంగా ఓ యువతి తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేం జాబ్.. ఇదేం టెన్షన్ రా నాయనా అంటూ తన బ్యాంక్ ఉద్యోగానికి రాం రాం చెప్పేసింది ఓ యువతి. ఇందుకు సంబంధిచిన ఓ వీడియో ఇన్ స్టాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది.
ఐ క్విట్ సర్కారీ జాబ్:
వైరల్ అవుతున్న వీడియోలో వివరాల ప్రకారం.. ‘నా పేరు వాణి (29) నేను నా సర్కారీ నౌకరీ వదిలేశాను. 2022 లో నేను ఐబీపీఎస్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించి మీరట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (punjab national bank) లో స్కేల్ వన్ ఆఫీసర్ గా రిక్రూట్ అయ్యాను. అయితే ఈ జాబ్ లో నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోయాను. మానసికంగా అలసిపోయే దాన్ని. ఇది కృతజ్ఞత లేని ఉద్యోగం. అందుకే నేను నా ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. నా నిర్ణయంపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మనసుకు సరిపోని చోటును వదిలిపెట్టాక వచ్చే ఆనందం, మానసిక ప్రశాంతత పశ్చాత్తాపాని కంటే ఎక్కువ విలువైనది' అంటూ తన సదరు యువతి తన అనుభవాలను వీడియో రూపంలో వెల్లడించించి. అయితే తరువాత ఆమె ప్లాన్ ఏంటి ఏ ఉద్యోగం ఎంచుకుందో మాత్రం వీడియోలో వివరించలేదు.
నెటిజన్లు రియాక్షన్:
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు ఆమె మానసిక ప్రశాంతత కోసం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తే.. మరికొందరు మాత్రం ఉద్యోగం లేకుండా జీవించగలిగే సౌలభ్యం అందరికీ ఉండదని గుర్తుచేస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడల్లా అందరూ ఉద్యోగాలు వదిలి ట్రావెల్ వ్లాగర్లు అవుతున్నారని ఓ నెటిజన్ స్పందించగా మరో నెటిజన్ స్పందిస్తూ నేను 2009లో ఎస్ బీఐలో చేరాను. 2021లో వదిలేశానని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇంకో వ్యక్తి స్పందిస్తూ ఉద్యోగం కొందరికి విలాసం, ఎందుకంటే వారికి బలమైన ఆర్థిక స్థితి లేదా ప్రత్యామ్నాయాలు ఉంటాయి. కానీ చాలామందికి ఇది కచ్చితమైన అవసరం, వారి జీవనాధారం. నీ నిర్ణయానికి శుభాకాంక్షలు, కానీ నీ ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పలేదు. యువతరానికి స్పష్టమైన పిక్చర్ ఇవ్వాలి కదా అని కామెంట్ చేశారు.






