జాతీయ రహదారి బ్రిడ్జిపై యువకుడు ప్రమాదకర విన్యాసాలు.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

కొంత‌మంది సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయ్యేందుకు ఎంతదూరం అయినా వెళ‌తారు. లైకులు, షేర్ల కోసం ప్రాణం మీద‌కు తెచుకునేందుకు కూడా వెన‌కాడ‌రు.

జాతీయ రహదారి బ్రిడ్జిపై యువకుడు ప్రమాదకర విన్యాసాలు.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: కొంత‌మంది సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయ్యేందుకు ఎంతదూరం అయినా వెళ‌తారు. లైకులు, షేర్ల కోసం ప్రాణం మీద‌కు తెచుకునేందుకు కూడా వెన‌కాడ‌రు. ప్రాణాలు పోతాయ‌ని తెలిసినా ప్ర‌మాద‌క‌ర విన్యాసాలు చేసేందుకు అస్స‌లు వెన‌కాడ‌రు. తాజాగా ఓ యువ‌కుడు కూడా అలాంటి విన్యాసాలే చేశాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీ ల‌క్నో జాతీయ ర‌హ‌దారిపై జ‌రిగింది. ర‌హ‌దారి బ్రిడ్జిని ప‌ట్టుకుని ఆ యువ‌కుడు కిందికి వేలాడుతూ ప్ర‌మాద‌క‌ర స్టంట్స్ చేశాడు. కింద వాహ‌నాలు వెళుతుంటే పైన రైల్వే బ్రిడ్జిపై పుష్ అప్స్ చేశాడు.

అత‌డు పుష‌ప్స్ చేస్తుంటే అత‌డి స్నేహితుడితో వీడియో తీయుంచుకున్నాడు. ఇక ఆ వీడియోను సోసష్ మీడియాలో పోస్ట్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు ఇలాంటి విన్యాసాలు చేసేవాళ్ల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల‌ను చూసి చిన్న‌పిల్ల‌లు సైతం ప్ర‌మాదక‌ర విన్యాసాలు చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకునే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. పోలీసులు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఇలా చేసేవారిపై సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకంటేనే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. VIDEO

Next Story