- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔరా అనిపించిన బామ్మ.. 80 ఏళ్ల వయసులో ఏం చేసిందో చూస్తే షాకవుతారు!
సాధారణంగా వృద్ధాప్యంలో బామ్మలు, తాతలు ఎలా ఉంటారో మనందరకీ తెలుసు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా వృద్ధాప్యంలో బామ్మలు, తాతలు ఎలా ఉంటారో మనందరకీ తెలుసు. నడవడానకి, తినడానికి కూడా ఇబ్బంది పడతారు. వారి సొంత పనులే చేసుకోడానికి కూడా ఇతరులపై ఆధారపడుతుంటారు. అలాంటిది 80 ఏళ్ల వయసులో ఓ బామ్మ చేసిన సాహసం అందరిని ఆశ్చర్యానికి గురచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా (Viral) మారింది.
భారత సైన్యంలో మాజీ బ్రిగేడియర్‌గా సేవలందించిన సౌరభ్ సింగ్ షెకావత్ తల్లి, డాక్టర్ శ్రద్ధా చౌహాన్ తన 80వ పుట్టిన రోజు సందర్భంగా ఎవరు ఊహించని సాహస క్రీడను చేశారు. పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ హర్యాణాలోని నార్మాల్ ఎయిర్‌స్ట్రిప్ నుంచి ఆమె స్కై డైవ్ చేసి అందరీని ఆశ్యర్యానికి గురిచేశారు. అయితే, ఆమె ఒంటరిగా ఈ సాహసం చేయలేదు. తన కుమారుడితో కలిసి ఈ సాహస క్రీడలో పాల్గొన్నారు.
ఇక దీనిపై బ్రిగేడియర్ షెకావత్ 'అమ్మతో కలిసి స్కై డైవ్ చేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఆమెకు ఈ వయస్సులో అసాధారణ విషయం. ఆమె ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఈ సాహసాన్ని చేసిన తీరు ఎంతో స్పూర్తిదాయకం' అని తెలిపారు.






