Ananth Ambani Viral video: ‘వాటి మీద మరీ ఇంత ప్రేమేంటన్నా నీకు’.. నెట్టింట అనంత్ అంబానీపై ప్రశంసల జల్లు

by Yella Dhawani Reddy |

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) చిన్నకుమారుడు

Ananth Ambani Viral video: ‘వాటి మీద మరీ ఇంత ప్రేమేంటన్నా నీకు’.. నెట్టింట అనంత్ అంబానీపై ప్రశంసల జల్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) జంతు ప్రేమికుడిగా కూడా అందరికి సుపరిచితుడే. ఈ నేపథ్యంలోనే ఆయన గుజరాత్ జామ్‌నగర్‌లో వంతారా (Vantara) పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా అనంత్ అంబానీ తనకు జంతువులపై ఉండే ప్రేమను మరోసారి చాటుకున్నారు.

అనంత్ అంబానీ ఏప్రిల్ 10వ తేదీన తన 30వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ద్వారక (Jamnagar to Dwarka) వరకూ ఆధ్యాత్మిక పాయాత్రను చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 140 కిలోమీటర్ల ఈ ప్రయాణం ప్రస్తుతం 5వ రోజుకు చేరుకుంది. అయితే, ఈ పాదయాత్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అనంత్ నడక ప్రయాణం మధ్యలో వందలాది బ్రాయిలర్ కోళ్లను మాంసం దుకాణాలకు తరలించే ఓ వ్యాన్ కనిపించింది. వెంటనే ఆ వ్యాన్‌ను ఆపి, రెట్టింపు ధర చెల్లించి వాటిని రక్షించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనంత్ అంబానీ చేతిలో ఓ కోడిని పట్టుకుని, వీటిని వధించకుండా కాపాడమని చెబుతున్నారు. అయితే, ఈ వీడియోకు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

కాగా, అనంత్ అంబానీ వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో సహకారం అందిస్తున్నారు. వంతరా ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జంతువులను రక్షించారు. ఇందులో 2000 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జంతు సంక్షేమ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి 'ప్రాణి మిత్ర జాతీయ అవార్డు'తో సత్కరించింది.

Next Story