నువ్వు సూపర్ బామ్మ.. 70 ఏళ్ల వయసులో 103 కిలోల బరువును అలవోకగా ఎత్తేస్తోంది!

by Yella Dhawani Reddy |

ప్రస్తుత రోజుల్లో చాలా మంది 40 ఏళ్లు దాటితే చాలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

నువ్వు సూపర్ బామ్మ.. 70 ఏళ్ల వయసులో 103 కిలోల బరువును అలవోకగా ఎత్తేస్తోంది!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది 40 ఏళ్లు దాటితే చాలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. నడవలేక, పరిగెత్త లేక ఆయాసపడిపోతుంటారు. ఇక వృద్ధాప్యం (Oldage) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి పనికి ఇతరులపై ఆధారపడాల్సిదే. కానీ, ఈ 70 ఏళ్ల బామ్మ (70 years granny) మాత్రం నా రూటే సేపరేటు అంటుంది. ఆర్థిరైటిస్ సమస్య (Arthritis problem) ఉన్నా అలవోకగా వందల కిలోల బరువులను ఎత్తేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) తెగ సందడి చేస్తోంది.

ఢిల్లీకి (Delhi) చెందిన రోష్ణీ దేవి ఆర్థరైటిస్ సమస్యతో తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడేది. ఆ నొప్పికి పరిష్కారంగా ఆమె కుమారుడు అజయ్ సంగ్వాన్ వ్యాయామం చేయమని జిమ్‌కు తీసుకెళ్లాడు. పెద్ద వయసు కాబ్టటి జిమ్‌లో మొదట్లో బాగా ఇబ్బందిపడేది. అయితే, కొడుకు మద్దతుతో నెమ్మదిగా జిమ్‌లో వివిధ వ్యాయామాలను ఆస్వాదించడం ప్రారంభించింది. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయడం మొదలెట్టింది. తాజాగా ఈ బామ్మ 103 కిలోల బరువును అలవోకగా ఎత్తింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అంతేకాదు, మోకాళ్లకు ఆర్థరైటిస్ సమస్య ఉన్నా సునాయాసంగా వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తూ వెయిట్ లిఫ్టర్ మమ్మీగా పేరుగాంచింది. ఇదే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి అందులో బామ్మ చేసే వ్యాయామ వీడియోలను షేర్ చేస్తోంది. ఈ వీడియోలు చూసి నేటితరం యువత ఆశ్చర్యపోతున్నారు. నువ్వు సూపర్ బామ్మ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story