G.O.A.T : యోగాసనాలు వేసిన మేక.. వావ్ అంటున్న నెటిజన్లు..(వీడియో)

by Sujitha Rachapalli |

సోషల్ మీడియాలో ఓ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది. ఎర్లీ మార్నింగ్ ఓ మేక యోగాసనాలు వేసిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ముందుగా ఈ పెట్ గోట్ ఓనర్ ధ్యానం, యోగా చేసింది. పలు ఆసనాలు ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత యోగా మ్యాట్ అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.

G.O.A.T : యోగాసనాలు వేసిన మేక.. వావ్ అంటున్న నెటిజన్లు..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది. ఎర్లీ మార్నింగ్ ఓ మేక యోగాసనాలు వేసిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ముందుగా ఈ పెట్ గోట్ ఓనర్ ధ్యానం, యోగా చేసింది. పలు ఆసనాలు ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత యోగా మ్యాట్ అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అయితే అక్కడే దగ్గరుండి ఇవన్నీ వీక్షించిన మేక.. యాజ్ ఇట్ ఈజ్ దింపేసింది. ఆమె చేసిన యోగాసనాలను పర్ఫెక్ట్‌గా వేసింది. అయితే ఇది నిజమా లేక ఏఐ వీడియోనా అని చాలా మంది చెక్ చేస్తుండగా.. ఇది నిజంగా నిజమేనని సమాధానమిచ్చింది గ్రోక్. ముఖ్యంగా చిన్న మేకలు చాలా చురుగ్గా ఉంటాయని.. గెంతడం, ఒక్కసారిగా వెనక్కి తిరగడం వంటివి చేస్తాయని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ యోగా సెషన్ కూడా నేచురల్ బిహేవియర్ అని తెలిపింది. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. గోట్ ఫర్ ఏ రీజన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఆకులు తిని పడుకోవడం కాదు కాస్త శారీరక వ్యాయామం కూడా అవసరం అనుకుందేమో అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇస్తున్నారు.

VIDEO

Next Story