- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: వామ్మో.. ఇదేంటి ఇంతుంది? ఇలాంటి గెదేను ఎప్పుడైనా చూశారా?
ప్రపంచంలో ఏ మూల ఏం వింత జరిగినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్‌గా మారుతుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ఏ మూల ఏం వింత జరిగినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్‌గా మారుతుంది. ఇక జంతువులకు సంబంధించిన అసాధారణ విషయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా నెట్టింట ఓ గెదే వీడియో వైరల్ అవుతోంది. ఈ గెదే ఆకృతి చూసి నెటిజన్లు సైతం ఆశ్యర్యపోతున్నారు. మరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన గెదే విశేషాలేంటో తెలుసుకుందామా.
థాయ్‌లాండ్‌లో గత 400 ఏళ్లుగా సాంప్రదాయ బఫెల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి ఏటా వర్షాకాలం వరి సాగు ప్రారంభానికి ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ప్రత్యేకమైన సౌందర్యం, బలం, జన్యశాస్త్రపరమైన లక్షణలున్నా గెదేలను ప్రదర్శిస్తారు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని ఉత్తాయ్ థానీ ప్రావిన్స్‌లో జెయింట్ బఫెల్లో ఫెస్టివల్ పోటీలు జరిగాయి. ఇందులో బుబాలస్ బుబాలిస్ అనే భారీ శరీర ఆకృతి కలిగిన నీటి గెదే అందరి దృష్టిని ఆకట్టుకుంది.
సాధారణంగా ఇవి ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉంటాయి. వీటిలో రివర్ బఫెల్లో, స్వాంప్ బఫెల్లో అనే రెండు రకాలుంటాయి. ఈ నీటి గెదేలను థాయ్ రైతులు వ్యవసాయ పనుల్లో వినియోగిస్తారు. ఇందులో రివర్ గెదేలను పాల ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇవి అధిక పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి కూడా. ఇక స్వాంప్ బఫెల్లోలను దుక్కి దున్నడానికి వాడుతారు. చాలా బలమైన ఈ గెదేలు తక్కువ ఎత్తులో చర్మం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో ఆడ గెదేలు 800 కిలోల వరకు మగ గెదేలు 1000 కిలోల వరకు బరువుంటాయి.
Fa Prathan - the champion of the Giant Buffalo competition, Uthai Thani Thai Buffalo Festival 🐃🇹🇭
— Sarahh (@Sarahhuniverse) March 31, 2025
© lanla_channel pic.twitter.com/Ps4smpKXEB






