Viral video: వావ్.. ప్రపంచంలోనే అందమైన క్రికెట్ గ్రౌండ్.. ఎక్కడుందో తెలుసా?

by Yella Dhawani Reddy |

సాధారణంగా స్టేడియంలు పట్టణ ప్రాంతాల్లో ఉంటాయి.

Viral video: వావ్.. ప్రపంచంలోనే అందమైన క్రికెట్ గ్రౌండ్.. ఎక్కడుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా స్టేడియంలు పట్టణ ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఓ స్టేడియం మాత్రం చుట్టూ కిలోమీటర్ల కొద్దీ పరుచుకున్న పచ్చదనం, కొండలు, గుట్టలతో కూడి దట్టమైన అటవీ ప్రాంతంలో దాగి ఉంది. ఈ ప్రాంతం అచ్చం అమెజాన్ అడవులను తలపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ స్టేడియం వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ స్టేడియం ఎక్కుడ ఉందో తెలుసా?

కేరళ రాష్ఱ్రంలో భారీ పచ్చదనంతో కూడిన అడవి మధ్య ఉన్న ఈ క్రికెట్ మైదానం ఓ పల్లెటూరు ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకమైన ప్రదేశాల వీడియోలు పోస్ట్ చేస్తూ పేరు పొందిన శ్రీజిత్.ఎస్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, ఈ మైదానాన్ని డ్రోన్ కెమెరాతో తీశాడు. వీడియోలో 'ఇది అమేజాన్ అడవి కాదు' అనే సందేశంతో, ప్రకృతి మధ్యలో కొంతమంది క్రికెట్ ఆడుతున్న దృశ్యాలను చూపించాడు. ఈ వీడియో ఇప్పటి వరకు 37.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. చాలా మంది యూజర్లు వీడియోపై కామెంట్లు చేస్తూ మైదానం అందాన్ని కొనియాడుతున్నారు.

ఇక వీడియోలో మైదానంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు. మైదానం చుట్టూ భారీగా విస్తరించిన అటవీ ప్రాంతం.. గుట్టలు.. మధ్యలో తరచి చూస్తే సన్నని మట్టి దారులు తప్ప ఇంకేమీ కనిపించినంతగా పచ్చదనం విస్తరించింది. ఇక దీనిపై మరింత శోధించగా.. అది వంద ఎకరాల్లో ఉన్న భారీ రబ్బర్‌ చెట్ల ఎస్టేట్‌ మధ్యలోనిదని తేలింది.

Next Story