Viral video: వావ్.. కుక్కలు కూడా ఎగురుతాయా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-13 12:16:03  IST  )

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Viral video: వావ్.. కుక్కలు కూడా ఎగురుతాయా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారటంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో నిత్యం నెట్టింట ప్రపంచంలో జరిగే అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండటం చూస్తుంటాం. ఇందులో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కుక్కలకు సంబంధించిన వీడియోలే అధికంగా ఉంటాయి. కుక్కలు తన వింత వింత విన్యాసాలు, తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరాస్తూనే ఉంటాయి. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఓ కుక్క వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకర్శిస్తుంది. అంతేకాదు, దాని టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక చిన్నపాటి మైదానం లాంటి ప్రదేశంలో కొంత మంది కూర్చుని ఉన్నారు. పక్కనే లాంగ్ జంప్ కోసం ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఇంతలో కొంచెం దూరం నుంచి ఓ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా గాల్లోకి పైకి ఎగిరి లాం..గ్ జంప్ చేసింది. ఇది చూసి అక్కడున్న వారు కూడా అరవటం వీడియోలో గమనించవచ్చు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం కుక్క టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. కుక్కలు కూడా ఎగురుతాయాని తెలియందంటూ, ఈ కుక్కు ట్రెయినర్‌కు గొప్ప టాలెంట్ ఉండి ఉంటుందని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story