Hadza Language: వామ్మో.. ఇవన్నీ పేర్లా? ఇలా ఉన్నాయేంటి.. పదిసార్లు విన్న పలుకలేం కదా!

by D.Reddy |
Hadza Language: వామ్మో.. ఇవన్నీ పేర్లా? ఇలా ఉన్నాయేంటి.. పదిసార్లు విన్న పలుకలేం కదా!
X

దిశ, వెబ్‌డెస్క్: మానవులు తమ భావ వ్యక్తీకరణకు ఎంచుకున్న మొదటి మార్గం భాష (Language). ఇక ప్రాంతాన్ని బట్టి భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నట్లే.. విభిన్న భాషలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాల్లో 7 వేలకు పైగా భాషలున్నట్లు సమాచారం. ఇక ఇందులో ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాతృభాష, అధికారిక భాష ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ భాష గురించి ఎందుకు చెబుతున్న అనుకుంటున్నారా? బహుబలి (Bahubali) సినిమాలో కిలికిలి భాష (kilikili languages) అందరికి గుర్తుండే ఉంటుంది కదా. వినడానికి, మాట్లాడానికి కష్టంగా ఉండే ఈ కిలికిలి భాషను ప్రత్యేకంగా సినిమా కోసమే రూపొందించారని కూడా తెలుసు. అలాంటి ఓ కఠినమైన భాష గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కేవలం భాష మాత్రమే కాదు వారి పేర్లు కూడా అత్యంత కఠినంగా ఉంటాయి. మరీ ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తూర్పు ఆఫ్రికాలోని ఉత్తర టాంజనియా (Tanzania) దేశంలో హడ్జాబే (Hadzabe) అనే తెగ ప్రజలు నివసిస్తున్నారు. లేక్ ఇయాసి ప్రాంతంలోని రాతి కొండలు, శుష్కలోయలలో ఉండే వీరు గుంపు గుంపులుగా జీవిస్తారు. వేటాడటం, తేనె సేకరించటం వీరి ప్రధాన జీవనాధారం. వారి జీవన శైలి పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉంటుంది. అడవి తల్లి తమను కాపాడుతుందని భావిస్తారు. ప్రతి ఏటా అడవిని మొక్కుతూ ఉత్సవాలు కూడా చేసుకుంటారు.

హడ్జాబే తెగ ప్రజలు హడ్జా (Hadza) అనే భాషను మాట్లాడుతారు. ఆ భాషే వీళ్లకంటూ ఓ ఐడెంటిటీని తీసుకొచ్చింది. ఇది ఒక ఐసోలేటెడ్ లాంగ్వేజ్ (మరే ఇతర భాషతోనూ సంబంధం లేని భాష). ఈ హడ్జా భాషను హడ్జాబే తెగ వారు తప్ప ఇతరులెవరూ మాట్లాడలేరు. కనీసం నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేరు. ఎందుకంటే వినడానికే అత్యంత కఠినంగా అనిపిస్తుంది. ఈ భాష ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి హడ్జాబే ప్రజల పేర్లు ఉదాహరణ. ప్రస్తుతం నెట్టింట వీరి పేర్లకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. మీరు కూడా చూసి ఈ భాష ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకోండి.



Next Story

Most Viewed