Viral Photo: వావ్.. అద్భతమైన ఫొటో.. అదృష్టం అంటే ఇతడిదే!

by Yella Dhawani Reddy |

తొండెం, భారీ శరీరంతో ఉండే ఏనుగులను (Elephants) ప్రపంచంలోనే అత్యంత పెద్ద జంతువులుగా చెబుతారు.

Viral Photo: వావ్.. అద్భతమైన ఫొటో.. అదృష్టం అంటే ఇతడిదే!
X

దిశ, వెబ్ డెస్క్: తొండెం, భారీ శరీరంతో ఉండే ఏనుగులను (Elephants) ప్రపంచంలోనే అత్యంత పెద్ద జంతువులుగా చెబుతారు. అంతేకాదు, ఇవి అతి తెలివైనవి కూడా. అలాగే ఏనుగులు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటాయి. వాటి జోలికి వెళ్తే తప్ప ఎవరికీ ఎటువంటి హానీ కలిగించవు. ఇక ఏనుగులు మనుషులతో ఎంతో స్నేహంగా ఉంటాయి. కాసింత తిండి, ఉండటానికి ఆవాసం కల్పిస్తే చాలు యజమానుల పట్ల వెలకట్టలేని ప్రేమ, విశ్వాసం చూపిస్తాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్, ఆలనాటి అందాల తార సౌందర్య జంటగా నటించిన 'రాజేంద్రుడు గజేంద్రుడు' సినిమాలో ఏనుగుకు, యజమానికి మధ్య ఉండే అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఇక ఇలాంటి సంఘటనలు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ (Viral) అవుతుంటాయి. యజమానులతో కలిసి అల్లరి ఆటలు, ఫన్నీ చేష్టలు తరచూ చూస్తుంటాం. ఇక తాజాగా ఏనుగులు, మనుషుల అనుబంధానికి ఓ ఫొటో (Photo) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు సైతం విపరీతంగా లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోలో ఏముందంటే.. ఓ వ్యక్తి హాయిగా నిద్రిస్తుండగా, పక్కనే ఏనుగు కూడా అతడిని హగ్ చేసుకుని పడుకుంది. అతడి తలను దాని తొండెంపై వాలించుకుని నిద్రిస్తుంది. ఈ ఫొటోను కాస్తా వైరల్ అవ్వగా, 'వావ్.. అద్భుతమైన ఫొటో', 'అదృష్టం అంటే ఇతడిదే', 'ఏనుగు అంత ప్రేమ చూపిస్తోందంటే అతడు దాన్ని ఎంత బాగా చూసుకున్నాడో' అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story