‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆహారంలో పురుగులు.. IRCTCకి రూ.10 లక్షల జరిమానా

by Kema Shiva Kumar |

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించిన పెరుగులో పురుగులు రావడంతో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆహారంలో పురుగులు.. IRCTCకి రూ.10 లక్షల జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: పాట్నా-టాటానగర్ (Patna–Tatanagar) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి వడ్డించిన పెరుగు (Curd)లో పురుగులు కనిపించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ IRCTCకి భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 15న పాట్నా నుంచి టాటానగర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రితేష్ కుమార్ సింగ్ (Ritesh Kumar Singh) అనే ప్రయాణికుడికి పెరుగు (Curd) వడ్డించారు. ఆ పెరుగులో పురుగులు పాకుతుండటాన్ని ఆయన గమనించి వీడియో తీశారు.

అయితే, ఆ వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. రైల్వే అధికారులు వచ్చి తనిఖీ చేసినప్పుడు కూడా పురుగులు స్పష్టంగా కనిపించాయి. అక్కడి సిబ్బంది అవి పురుగులు కావని, కేసరి (Kesar) అని కవర్ చేసే ప్రయత్నం చేయడంపై నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. IRCTCకి రూ. 10 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా సదరు ఆహార సేవల విభాగం (Service Provider)పై రూ.50 లక్షల జరిమానా విధిస్తూ, వారి కాంట్రాక్టును రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Next Story