తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ వింత ఆకారాలు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా..!

by Javid Pasha |

తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ వింత ఆకారాలు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా..!

తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ వింత ఆకారాలు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా..!
X

దిశ, ఫీచర్స్ : ‘తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ రహస్యం’, ‘ఇంటికోసం పునాది తీస్తుండగా కనిపించిన నిధి’ వంటి వార్తలు మీరు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. దాదాపు ఆ కోవకు చెందనదే కానీ, మరింత ఆసక్తి కలిగించే న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధిలో మరమ్మతు పనులకోసం తవ్వకాలు చేపట్టగా ఊహించిన సీక్రెట్ బయట పడింది. అది గమనించిన వారంతా దాని తాలూకు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రపంచ ప్రజలను వెంటాడుతున్నాయంటూ గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆ రహస్యం ఏంటంటే..

అది పోలాండ్‌లోని వ్రోక్లా యూనివర్సిటీ (Wroclaw University) సమీపంలోని వీధి. ఇక్కడ రోడ్డు పనుల పునురుద్ధరణలో భాగంగా తవ్వకాలు చేపట్టారు. అలా తవ్వుతూ ఉండగా ఏవో కొన్ని వింతైన ఆకారాలు బయటపడ్డాయి. కానీ అవేమిటో తవ్వకాలు జరుపుతున్న కూలీలకు అర్థం కాలేదు. కాగా పనులు చేపడుతున్న వీధిలోనే వ్రోక్లా విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్ర విభాగం కూడా ఉంది. కాబట్టి అక్కడి నిపుణులను పిలిచి చూపించగా అసలు రహస్యం తెలిసిపోయింది. ఏంటంటే..

తవ్వకాల్లో బయటపడ్డ 50 కంటే ఎక్కువ వస్తువులు మొదటి, రెండవ, ప్రపంచ యుద్ధ కాలం నాటి హెల్మెట్లుగా పురావస్తు నిపుణులు నిర్ధారించారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగిన విషయాలు తెలిసిందే. ఇప్పటికీ రష్యా, ఉక్రెయిన్, ఇరాన్ ఇజ్రాయెల్, ఇండియా పాకిస్తాన్ వంటి దేశాల మధ్య యుద్ధాలు జరగడం, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం నాటి వస్తువులు బయటపడటంతో నాటి నుంచి నేటి వరకు యుద్ధ తాలూకు జ్ఞాపకాలు నీడలా వెంటాడుతున్నాయని నిపుణులు పేర్కొనగా, ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Link

Next Story