Heart Attack: బరువు తగ్గడానికి జిమ్‌లో వర్కౌట్.. అకస్మాత్తుగా గుండెపోటు

by Ramesh Naini |

దేశంలో పలు చోట్ల తరుచుగా గుండెపోటు (Heart Attack) మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి.

Heart Attack: బరువు తగ్గడానికి జిమ్‌లో వర్కౌట్.. అకస్మాత్తుగా గుండెపోటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో పలు చోట్ల తరుచుగా గుండెపోటు (Heart Attack) మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల డ్యాన్స్, జిమ్ చేస్తున్న సమయంలో కొంత మంది గుండెపోటుకు గురైన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. తాజాగా హర్యానా రాష్ట్రం (Faridabad) ఫరీదాబాద్‌లోని బల్లాభ్‌గఢ్‌ సెక్టార్‌-9లోని జిమ్‌లో ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాజానహర్‌సింగ్‌ కాలనీకి చెందిన (Pankaj Sharma) పంకజ్‌ శర్మ (37) దాదాపు 170 కిలోల బరువు ఉన్నాడు. దీంతో అతను బరువు తగ్గేందుకు నాలుగు నెలల క్రితం జిమ్‌లో చేరినట్లు తెలిసింది. మంగళవారం కూడా వర్కౌట్‌ ప్రారంభించడానికి ముందు బ్లాక్‌ టీ తాగి పుల్అప్స్‌ చేశాడు. ఈక్రమంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన అతడి స్నేహితులు పంకజ్‌కు నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రెండుసార్లు సీపీఆర్‌ కూడా చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అతని స్నేహితులు సమీపంలోని సర్వోదయ ఆసుపత్రి నుంచి వైద్యులను పిలిపించారు.

అతన్ని పరీక్షించిన తర్వాత, వారు పంకజ్ చనిపోయినట్లు నిర్దారించారు. బరువు తగ్గడానికి పంకజ్ గత నాలుగు నెలలుగా క్రమం తప్పుకుండా జిమ్‌కు వెళ్తున్నాడని అతని స్నేహితుడు రోహిత్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. పంకజ్ తన ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండేవాడని, ప్రోటీన్ పౌడర్లు లేదా స్టెరాయిడ్లు వంటివి కూడా తీసుకోలేదని అతని తండ్రి రాజేశ్ తెలిపారు. ఇక జిమ్ ట్రైనర్ విక్రమ్ దాస్ ఇది ఒక ఊహించని సంఘటనగా పేర్కొన్నారు. అతను ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సకాలంలో సీపీఆర్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. వారు సీసీటీవీ ఫుటేజ్, వివరాలు తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, పంకజ్ నాలుగు ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అతనికి 2 సంవత్సరాల వయసు గల కూతురు ఉంది. పంకజ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story