- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీర్లు ఏరులై పారడం అంటే ఇదే.. ఏకంగా 3 లారీల లోడ్ నేలపాలు!
బీర్ బాటిళ్లు... చిన్న కాలువలో పారబోస్తున్న వీడియో.. మందు బాబులను కలవరపెడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఫన్నీ అలాగే, కాస్త క్రూరంగా ఉన్న వీడియోలు కూడా హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇక మందుబాబులకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే బీర్ బాటిళ్లు... చిన్న కాలువలో పారబోస్తున్న వీడియో.. మందు బాబులను కలవరపెడుతోంది.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ... వీడియో చూసిన మందుబాబులు మాత్రం ఎమోషనల్ అవుతున్నారు. దాదాపు 3 లారీల బీర్ల కాటన్స్ ను ఓ ఫ్యాక్టరీ దగ్గర దింపారు. అనంతరం దాదాపు 50 మంది కూలీలు రంగంలోకి దిగారు. కాటన్స్ లో ఉన్న బీరు బాటిళ్లను చిన్న కాలువలో పారబోస్తూ కనిపించారు. ఎంతో ఆనందంగా... ఉల్లాసంగా ఈ పని చేస్తున్నారు ఆ కార్మికులు.
అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... మందుబాబులు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఒరేయ్ ఎందుకలా బంగారం లాంటి బీర్లను పారబోస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అవి ఎక్స్ పైర్ అయినవి అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బీర్ బాటిళ్లకు ఎక్స్ పైర్...ఉండదని మరి కొంతమంది అంటున్నారు. ఎక్స్ పైర్... కాకముందు తమకు ఇస్తే పేదలకైన పంచే వాళ్ళమని మరి కొంతమంది మందుబాబులు సెటైర్లు పేల్చుతున్నారు. క్లిక్






