Viral Video: మహిళల బనానా పార్టీ! అరటి పండు నోట్లో పెట్టుకొని కపుల్ డాన్స్ వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-07-25 06:25:54  IST  )

నెలకు ఒకసారి లేదా ఏడాదికి రెండు సార్లు వారికి నచ్చిన విధంగా మహిళలు కిట్టి పార్టీ వేడుకలు జరుపుకుంటారు.

Viral Video: మహిళల బనానా పార్టీ! అరటి పండు నోట్లో పెట్టుకొని కపుల్ డాన్స్ వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా కొంత మంది మహిళలు కిట్టి పార్టీలు (kitty parties) నిర్వహిస్తుంటారు. నెలకు ఒకసారి లేదా ఏడాదికి రెండు సార్లు వారికి నచ్చిన విధంగా మహిళలు వేడుకలు జరుపుకుంటారు. కిట్టి పార్టీలో గృహిణులు వారి బాధలు అన్నీ మర్చిపోయి ఈ పార్టీలో ఎంజాయ్ చేయడం, తోటి స్నేహితురాల్లతో ముచ్చట్లు చెప్పుకోవం చేస్తుంటారు. కొందరూ శృతిమించి కూడా (kitty party) కిట్టి పార్టీ వేడుకలు జరుపుకుంటారు. మద్యం సేవించడం, పేకాట ఆడటం లాంటివి చేస్తుంటారు. అదేవిధంగా నచ్చిన ఫుడ్ తినడం, వివిధ రకాల ఇండోర్ గేమ్స్ ఈ కిట్టి పార్టీలో ముఖ్యంగా జరిగేవి. ఈ నేపథ్యంలోనే ఒక విచిత్రమైన గేమ్‌ను కొంత మంది మహిళలు అంత కలిసి ఆడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో (viral video) సమాజిక మాధ్యమాల్లో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియోలో చూపించిన ప్రకారం.. చాలా మంది మహిళలు ఒక ఇంట్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా కనబడుతోంది. మహిళలు ఒక జతగా డివైడ్ అయ్యి నోట్లో తొక్క తీసిన అరటి పండు పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. ఒక హిందీ పాట బ్యాక్ రౌండ్‌లో ప్లే అవుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగా మహిళలు తమ నోటితో అటువైపు ఇటువైపు అరటి పండును పట్టుకొని కపుల్ డాన్స్ చేస్తున్నారు. అరటి పండు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో కనిపించే వేడుకల్లో అందురూ గృహిణులుగానే కన్పిస్తున్నారు. మహిళలు బనానా పార్టీ (Banana Party) చేసుకుంటున్నారని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సమాజం ఎటుపోతుంది రా? అని వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు కొంత మంది వారిని అభినందిస్తున్నారు. స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇలాంటి గేమ్స్ ఆడితే తప్పేంటని కొంత మంది వారికి సపోర్ట్ చేస్తున్నారు. వారిని చూస్తే కొంచెం తేడాగా కనబడుతున్నారని, నెక్ట్స్ టైమ్ అరటి పండు తొక్క తీయకుండా గేమ్ ఆడాలని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇప్పుడు జరుపుకునే మహిళల కిట్టి పార్టీలో ఇలాంటి ట్రెండ్ గేమ్స్ నడుస్తున్నాయని ఆసక్తికరంగా ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.

Link

Next Story