- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బు లేనప్పుడు బ్రేకప్ చెప్పి, ఇప్పుడు వాడే కావాలంటూ కన్నీళ్లు.. యువతిపై నెటిజన్ల ఆగ్రహం
డబ్బులు లేవని బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన యువతికి ఊహించని షాక్ ఎదురైంది. మొదట్లో డబ్బులు లేకున్నా ఆ యువకుడు బ్రేకప్ తరవాత విదేశాలకు వెళ్లి ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం విదేశాల్లో సెటిల్ అవ్వడంతో పాటు మరోయువతితో తిరిగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: డబ్బులు లేవని బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన యువతికి ఊహించని షాక్ ఎదురైంది. మొదట్లో డబ్బులు లేకున్నా ఆ యువకుడు బ్రేకప్ తరవాత విదేశాలకు వెళ్లి ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం విదేశాల్లో సెటిల్ అవ్వడంతో పాటు మరోయువతితో తిరిగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో మాజీ ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. యువతి షేర్ చేసిన వీడియోలో తాను ఓ అబ్బాయిని రెండేళ్లుగా డేట్ చేసినట్టు చెప్పింది. కానీ అతడి దగ్గర డబ్బులు ఉండేవి కాదని బయటకు వెళ్లి ఏదైనా తినడానికి రూ.200 కూడా ఉండేవి కాదని చెప్పింది. అతనితో వెళ్లిన ప్రతిసారి డబ్బులు తానే చెల్లించేదానని తెలిపింది.
ఓసారి బర్గర్ అడిగితే ఇంట్లో చేసి పెడతానని చెప్పాడని బర్గర్ ఇంట్లో ఎలా చేస్తావని తలపట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతకాలం చూసి అతడు మాకపోవడంతో వదిలేశానని చెప్పింది. కానీ ఇప్పుడు అతడు న్యూజిలాండ్ లో ఉన్నాడని మంచి ఉద్యోగం వచ్చిందని తెలిపింది. అక్కడ ఓ గర్ల్ ఫ్రెండ్ ను కూడా చేసుకున్నాడని ఆమెను ఫైవ్ స్టార్ హోటళ్లకు తిప్పుతున్నాడని చెప్పింది. తనతో ఉన్నప్పుడు రూ.500 కూడా ఖర్చు చేయలేదని ఇప్పుడు హోటళ్లకు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన అదృష్టమే బాగా లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు యువతిపై మండిపడుతున్నారు. డబ్బులు లేనప్పుడు వదిలేసి ఇప్పుడు సెటిల్ అవ్వగానే అతడు కావాలా? అతడు సరైన పనే చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.






