- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి కుక్కలకు ఆహారం పెట్టిందని దాడి చేసిన కాలనీవాసులు.. వీడియో వైరల్
వీధి కుక్కలను షెల్టర్లకు పంపాలి అంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే డాగ్ లవర్స్ ఆందోళనలతో సుప్రీం

దిశ, వెబ్ డెస్క్: వీధి కుక్కలను షెల్టర్లకు పంపాలి అంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే డాగ్ లవర్స్ ఆందోళనలతో సుప్రీం కోర్టు వెనక్కి తగ్గి వ్యాక్సిన్లు ఇచ్చిన తరవాతవ వాటిని వదిలేస్తామని హామీ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టింది. గుర్తించిన కొన్ని ప్రదేశాలలో వీధి కుక్కులకు ఆహారం పెట్టాలని సూచించింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు తరవాత షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెసిడెన్షియల్ స్థలంలో ఓ మహిళ వీధి కుక్కలకు భోజనం పెట్టింది. దీంతో ఆ కాలనీవాసులు ఆమెపై దాడి చేశారు. కర్రలతో మహిళపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమె నడవలేని స్థితికి చేరుకున్నారు. తనపై దాడి చేసిన మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కుక్కలకు భోజనం పెడితే దాడి చేయాలని చట్టాలు చెప్పలేదని కొట్టినవారిని కఠినంగా శిక్షించాలని డాగ్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు కుక్కలను షెల్టర్లకు తరలించాలి అంటూ తీర్పు ఇచ్చిన తరవాతనే ఇలాంటి దాడులు పెరిగాయని డాగ్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో






