మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌ను జుట్టుపట్టి కొట్టిన లేడీ దొంగ.. ఆ తర్వాత చస్తానని బెదిరింపు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-22 16:42:22  IST  )

ఆగ్రా ట్రాన్స్ యమునా పీఎస్ పరిధిలో జరిగిన ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టేషన్‌లో ఉన్న పోలీసులందరినీ ఓ ఆటాడుకున్న లేడీ దొంగ.. మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌పై దారుణంగా దాడి చేసింది. రివర్స్‌లో తనను టార్చర్ పెట్టారని వీడియో రిలీజ్ చేసింది.

మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌ను జుట్టుపట్టి కొట్టిన లేడీ దొంగ.. ఆ తర్వాత చస్తానని బెదిరింపు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : ఆగ్రా ట్రాన్స్ యమునా పీఎస్ పరిధిలో జరిగిన ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టేషన్‌లో ఉన్న పోలీసులందరినీ ఓ ఆటాడుకున్న లేడీ దొంగ.. మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌పై దారుణంగా దాడి చేసింది. రివర్స్‌లో తనను టార్చర్ పెట్టారని వీడియో రిలీజ్ చేసింది. దీంతో పోలీసులు కూడా పీఎస్‌లో దొంగ చేసిన రచ్చకు సంబంధించిన వీడియోను విడుదల చేయాల్సి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. గతేడాది సెప్టెంబర్‌లో సర్జు యాదవ్ అనే లేడీ మీద దొంగతనం కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరిలో కేసు క్లోజ్ అయింది. అయితే ఈ కేసు స్టేటస్ తెలుసుకునేందుకు స్టేషన్‌కు వచ్చింది సర్జు యాదవ్. కేసు క్లోజ్ అయిందని చెప్పడంతో ఫైర్ అయింది. పోలీసులను బూతులు తిడుతూ.. మహిళా పోలీసు అధికారి అయిన మనీషాపై దాడికి పాల్పడింది. జుట్టుపట్టి లాగుతూ ఇష్టారీతిన కొట్టింది. ఆ తర్వాత తనకు తానే గాయం చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై BNS సెక్షన్లు 126, 135, 170 కింద కేసు నమోదు చేసి.. కోర్టుకు పంపించారు పోలీసులు.

అయితే సర్జు యాదవ్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. పోలీసులు తనపై దాడి చేశారని.. బట్టలు చింపి.. అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పింది. తన ఒంటిపై గాయాలను చూపించింది. తనకు న్యాయం కావాలని లేదంటే చనిపోతానని బెదిరించింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అనే విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు స్టేషన్‌లో సర్జు యాదవ్ చేసిన బీభత్సాన్ని చూపిస్తూ వీడియో విడుదల చేశారు.

Next Story