- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానంలో లేడీ స్మోకింగ్..ముఖానికి మాస్క్ పెట్టుకొని !
బుర్కా ధరించి ఉన్న మిడిల్ ఏజ్డ్ మహిళ.. లైటర్ తో సిగరెట్ వెలిగించింది. రెండుసార్లు స్మోక్ చేసిన అనంతరం పక్కన

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో విమానాల ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం.. కనీసం వారంలో రెండు ప్రమాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విమానాల ప్రమాదం వల్ల.. సామాన్యులతో పాటు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కూడా అచ్చం పోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది.
కదులుతున్న విమానంలో ఓ మహిళ స్మోకింగ్ చేస్తూ కనిపించింది. దీంతో విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. స్మోకింగ్ ఎలా చేస్తావ్? ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యులు? అంటూ సదరు మహిళపై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన మన ఇండియాలో జరగలేదు. ఇస్తాంబుల్ నుంచి సిప్రస్ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన జరిగింది.
అయితే ఈ విమానంలో ప్రయాణించిన బుర్కా ధరించి ఉన్న మిడిల్ ఏజ్డ్ మహిళ.. లైటర్ తో సిగరెట్ వెలిగించింది. రెండుసార్లు స్మోక్ చేసిన అనంతరం పక్కన ఉన్న ప్రయాణికులు గమనించారు. దీంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. దానికి ఆమె భయపడకుండా.. అక్కడ ఉన్న సీట్లు అలాగే పేపర్లకు నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇలాంటి సాహసాలు ప్రయాణికులు చేస్తే... ప్రమాదాలు జరుగుతాయని... వార్నింగ్ ఇస్తున్నారు.






