షాకింగ్.. క్యాప్సికమ్ లో భయకరమైన తేలు..!

by velandi.Saikiran |

ప్రతి ఇంట్లో కూరగాయలు ( Vegetables) తినడం కామన్. పట్టణాల్లో ఉన్నవారు ఎక్కువ శాతం... కూరగాయలు తింటారు. నిత్యం

షాకింగ్.. క్యాప్సికమ్ లో భయకరమైన తేలు..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి ఇంట్లో కూరగాయలు ( Vegetables) తినడం కామన్. పట్టణాల్లో ఉన్నవారు ఎక్కువ శాతం... కూరగాయలు తింటారు. నిత్యం మార్కెట్ కు వెళ్లడం.. లేదా వారంలో ఒకరోజు... మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక తెచ్చిన కూరగాయలను ఇంట్లో ఉన్న మహిళలు (Women).. బాగా కడిగిన తర్వాత కట్ చేసి కూర వండేస్తారు.

కూరగాయలు ఎంత శుభ్రం చేసినా... ఏదో ఒక మూలన బ్యాక్టీరియా లేదా ఇతర కీటకాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పురుగులు తప్ప విషపూరిత... కీటకాలు... పెద్దగా రావన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా... క్యాప్సికంలో ( Capsicum)... ఏకంగా చిన్న తేలు ( Scorpion) ప్రత్యక్షమైంది. ఓ మహిళ క్యాప్సికం కోస్తుండగా... చిన్నపాటి తేలు వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక తేలు వీడియో వైరల్ కావడంతో... వంట రూముల్లో కూరగాయలు కట్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని... నెటిజెన్స్ కోరుతున్నారు. లేకపోతే విషపూరితమైన కీటకాలు వస్తాయని... చెబుతున్నారు. కూరగాయలు కోసేటప్పుడు... చాలా జాగ్రత్తగా కడిగి... కట్ చేసేటప్పుడు లోపల ఇలాంటి కీటకాలు ఉన్నాయి అనే దాని పైన కూడా... దృష్టి పెట్టాలని చెబుతున్నారు.

Next Story