ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ.. కడుపుతో ఉన్నానని డ్రామాలు.. చివరకు కాళ్లు పట్టుకుని.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-02 12:15:15  IST  )

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పక్కర్లేదు. భారీ ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందులు పడుతుంటారు జనాలు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొంటూ ముందుకు సాగడం కామన్. కానీ ఓ ఆటో డ్రైవర్

ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ.. కడుపుతో ఉన్నానని డ్రామాలు.. చివరకు కాళ్లు పట్టుకుని.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పక్కర్లేదు. భారీ ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందులు పడుతుంటారు జనాలు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొంటూ ముందుకు సాగడం కామన్. కానీ ఓ ఆటో డ్రైవర్ తన బైక్‌ను తాకాడని నార్త్‌కు చెందిన ఓ మహిళ హల్ చల్ చేసింది. అతన్ని బండబూతులు తిడుతూ రెచ్చిపోయి.. ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోయింది. స్కూటీని ఢీకొడితే మాత్రం చెప్పుతో కొట్టాలా అని తిట్టిపోస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో పోలీసుల ముందు హాజరైన ఆమె.. కడుపుతో ఉన్నానని, అబార్షన్ అవుతుందనే భయంతోనే అలా రియాక్ట్ అయ్యానని తెలిపింది. ఆటో డ్రైవర్‌కు, కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. బెంగళూరులోనే తనకు జాబ్ వచ్చిందని.. ఈ స్థలం, కన్నడ భాష అంటే అభిమానమని వివరించింది. తాను తప్పు చేశానని.. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని అపాలజీ చెప్పింది. కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ కాళ్లు పట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అందితే జుట్టు లేదంటే కాళ్లు మాదిరిగా ఉంది ఈమె కథ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అంత అరోగెంట్‌గా బిహేవ్ చేసే ముందు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలుసుకోవాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story