ఆన్లైన్ రివ్యూలు చూసి పెళ్లి సంబంధానికి నో చెప్పిన అమ్మాయి తండ్రి.. అసలు విషయం ఏంటంటే..

by Naga Rani Yarlagadda |

పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లంటే తంట, కడుపు మంట.. ఇవి నేటి యువత చెప్పే మాటలు. పెళ్లి చేసేటపుడు అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసి చెయ్యాలంటారు.

ఆన్లైన్ రివ్యూలు చూసి పెళ్లి సంబంధానికి నో చెప్పిన అమ్మాయి తండ్రి.. అసలు విషయం ఏంటంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లంటే తంట, కడుపు మంట.. ఇవి నేటి యువత చెప్పే మాటలు. పెళ్లి చేసేటపుడు అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసి చెయ్యాలంటారు. కానీ ఇప్పుడు అవేం చూడట్లేదు. మోస్ట్లీ ఇప్పుడు జరిగే పెళ్లిళ్లన్నీ ప్రేమ పెళ్లిళ్లే అవుతున్నాయి. ఏడు తరాలు కాదు కదా.. ఒకట్రెండు తరాలు, మంచి చెడులు కూడా చూస్కోవడం లేదు. ఆస్తి, సంపాదన, గవర్నమెంట్ ఉద్యోగం వంటివి ఉన్నాయా లేవా అన్నవే చూస్తున్నారు తప్ప.. అబ్బాయి ఎలాంటి వాడు అని బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయని తల్లిదండ్రులున్నారు. అలాంటి పెళ్లిళ్లలో చాలా వరకూ చివరికి విషాదాంతమవుతున్నాయి. వ్యసనాలు, అనుమానం, ధనదాహం వంటివి పెరగడంతో.. వెరసి అమ్మాయి తల్లిదండ్రులకు ఆమె చావుతో కడుపుశోకం మిగులుతోంది.

తాజాగా ఎక్స్ లో ఓ వ్యక్తి పెట్టిన కామెడీ సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది. నిజానికి అది జోక్ అయినా.. అందులో నిజముందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దాని సారాంశం ఆన్లైన్ రివ్యూలతో అమ్మాయి తండ్రి సంబంధాన్ని రిజెక్ట్ చేశాడు.

తమ అమ్మాయికి సంబంధం రాగా.. ఆ తండ్రి అబ్బాయి తండ్రితో మీ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశామని చెప్తాడు. అందుకు అటు అబ్బాయి తండ్రి ఏం తెలిసిందని అడగ్గా.. మీ అబ్బాయి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రతీ రెస్టారెంట్ కి ఏవరేజ్ ఫుడ్, బ్యాడ్ ప్యాకింగ్ అని పేర్కొని 1 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చాడని తెలిసింది. అలాగే అమెజాన్ లో కొన్న ప్రతి వస్తువుకీ Not Worth the Money అని నెగిటివ్ రివ్యూస్ పెట్టినట్లు కూడా తెలిసింది. ఇలా జీవితంలో ఏదీ నచ్చని అబ్బాయికి మా అమ్మాయి మాత్రం ఎలా నచ్చుతుంది? మాకు ఈ సంబంధం వద్దు అని చెప్పారు.

నిజంగానే ఆయన నో చెప్పడంలో తప్పేం ఉంది చెప్పండి. అతని జీవితంలో ఏ ఫుడ్ తోనూ, ఏ వస్తువుతోనూ సంతృప్తి చెందని వ్యక్తి.. ఒక అమ్మాయిని పెళ్లాడి తనకు నచ్చలేదని వదిలేస్తే ఆమె జీవితం నాశనమైనట్లే కదా అని ఈ పోస్ట్ చూసిన నెటిజన్లంతా అంటున్నారు.

ఎక్స్ పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story