ఒక్క త‌ప్పిదం.. బుల్లెట్ బైక్ ను తుక్కు తుక్కు చేసిన లేడీ

by velandi.Saikiran |

డ్యాష్ ఇచ్చాడ‌న్న కోపంతో బుల్లెట్ బైక్ ను ఓ లేడీ తుక్కు తుక్కు చేసిన వైర‌ల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న జైపూర్ లో జ‌రిగింది.

ఒక్క త‌ప్పిదం.. బుల్లెట్ బైక్ ను తుక్కు తుక్కు చేసిన లేడీ
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో జనాలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. చిన్న తప్పిదాలకు పెద్ద శిక్షలు వేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి బైక్ తో ఢీ కొట్టాడన్న కోపంతో ఓ మహిళ రెచ్చిపోయిన సంఘటన జైపూర్ లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆ వ్య‌క్తి బుల్లెట్ బైక్ ను ( Royal Enfield ) తుక్కు తుక్కు చేసింది సదరు మహిళ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్ లో విపరీతంగా ట్రాఫిక్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రాఫిక్ నేపథ్యంలో వాహనాలు కాస్త మెల్లిగానే వెళ్తూ ఉంటాయి. ఈ సందర్భంగా ఒక బైకు మరొక బైక్ అనుకోకుండా టచ్ అవుతూ ఉంటాయి. అయితే అచ్చం అలాగే తాజాగా ఓ సంఘటన జైపూర్ లో జరిగింది.

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ వ్యక్తి స్కూటీపై వెళుతున్న ఓ మహిళకు డ్యాష్ ఇచ్చాడు. అనుకోకుండా కాస్త ఆమెకు ఈ బుల్లెట్ బైక్ టచ్ అయింది. దీనికి వెంటనే ఆ బుల్లెట్ వ్యక్తి క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ సదరు మహిళ అస్సలు తగ్గలేదు. ఆ బుల్లెట్ బైక్ అద్దాలు, లైట్లు పగలగొట్టారు. మొదట హెల్మెట్ తో బైక్ సెన్సిటివ్ భాగాలన్నీ విరగొట్టింది. ఆ తర్వాత పెద్ద రాయి తీసుకొని వెనుక ఉన్న లైట్స్ తో పాటు పార్ట్స్ డ్యామేజ్ చేసింది.

అయితే ఆ బుల్లెట్ బైక్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వీడియో తీస్తున్నప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. పోలీసులు తనను ఏం చేయలేరంటూ రెచ్చిపోయి మరి మరింత ఎక్కువ చేసింది ఆ మ‌హిళ‌. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే దీనిపై నెటిజన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. చిన్నపాటి డ్యాష్ కు ఇంత ఓవరాక్షన్ అవసరమా ? ఆ లేడీని వెంటనే అరెస్టు చేయాలని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

Next Story