- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: వీధి కుక్కల భయం..180 మీటర్లకు ఓలా బుక్ చేసుకున్న మహిళ
వీధి కుక్కలకు భయపడి ఓ మహిళ 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: వీధి కుక్కలకు భయపడి ఓ మహిళ 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ అనే వ్లాగర్ మరియు ఓలా రైడర్ ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. తాను రైడ్‌కు వెళ్లగా కేవలం 180 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఇంత తక్కువ దూరానికి ఓలా బుక్ చేసుకున్నారని ప్రశ్నించగా ఆ మహిళ తనకు కుక్కలు అంటే భయం అని వీధిలో చాలా కుక్కలు ఉన్నాయని సమాధానం ఇచ్చింది.
దీంతో ఆశ్చర్యపోయిన రైడర్ ఓటీపీ అడిగి ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. తరవాత నవ్వుతూ బండి నడుపుతూ ఆమెను ఇంటివద్ద దింపేశాడు. ఆ చిన్న రైడ్‌కు రూ.19 కాగా ఆ డబ్బులు ఇచ్చేసి యువతి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా 2 లక్షలకు దగ్గరగా లైక్స్ వచ్చాయి. వేల కొద్దీ షేర్స్ చేశారు. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అసలు వెళ్లే దారిలో ఒక్క శునకం కూడా కనిపించలేదని డబ్బులు బొక్క అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఓలా క్యాబ్ ఇలా కూడా ఉపయోగిస్తున్నారా అంటూ కామెంట్ చేశారు.






