Viral Video : సాఫ్ట్ డ్రింక్ తాగిన ఎలుగుబంటి.. క్యూట్ రియాక్షన్.. చూసి తీరాల్సిందే!

by Sujitha Rachapalli |

చత్తీస్‌గఢ్ మహసముంద్ ఏరియాలోని చంఢీమాత మందిర్‌ సమీపంలోకి వచ్చింది ఓ ఎలుగు బంటి. సాధారణంగా హాని చేస్తుందని భయపడిపోతారు జనాలు. కానీ ఓ కుర్రాడు రీల్ కోసం.. ఎలుగు బంటికి చాలా దగ్గరగా వెళ్లి మరీ సాఫ్ట్ డ్రింక్ ఇచ్చాడు. అది కూడా అంతే

Viral Video : సాఫ్ట్ డ్రింక్ తాగిన ఎలుగుబంటి.. క్యూట్ రియాక్షన్.. చూసి తీరాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్ : చత్తీస్‌గఢ్ మహసముంద్ ఏరియాలోని చంఢీమాత మందిర్‌ సమీపంలోకి వచ్చింది ఓ ఎలుగు బంటి. సాధారణంగా హాని చేస్తుందని భయపడిపోతారు జనాలు. కానీ ఓ కుర్రాడు రీల్ కోసం.. ఎలుగు బంటికి చాలా దగ్గరగా వెళ్లి మరీ సాఫ్ట్ డ్రింక్ ఇచ్చాడు. అది కూడా అంతే నార్మల్‌గా ఆ డ్రింక్ తీసుకుని.. ఎన్నో రోజులుగా అలవాటు ఉన్నట్లుగా తాగింది. బాగుంది అన్నట్లుగా క్యూట్ రియాక్షన్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన జనాలు కొందరు ఎలుగుబంటి స్పందించిన తీరుకు ఫిదా కాగా ఇంకొందరు మాత్రం మనుషులు జంతువుల పట్ల ప్రవర్తించే తీరుపై ఫైర్ అవుతున్నారు. యానిమల్స్‌కు సాఫ్ట్ డ్రింక్స్, జంక్ ఫుడ్ ఆఫర్ చేయకూడదని.. దీనివల్ల వాటికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించకూడదని సూచిస్తున్నారు. కాగా ఇప్పటికే కేరళలోని కొన్ని ఏనుగులు మాంసం కూడా తింటున్నాయని.. ఇందుకు కారణం అవి తిరిగే చోట చెడిపోయిన మాంసాహారాన్ని పడేయడమేనని చెప్తున్నారు విశ్లేషకులు.

Next Story