- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన భార్య..ఇద్దరిని పట్టుకుని చితకబాదిన భర్త
ప్రియుడితో గెస్ట్ హౌస్‌కు వెళ్లిన భార్య.. భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో భార్యను ప్రశ్నించగా ఇరువురి మధ్య పెద్ద సీన్ జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో యూపీలోని బృందావన్‌లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడితో గెస్ట్ హౌస్‌కు వెళ్లిన భార్య.. భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో భార్యను ప్రశ్నించగా ఇరువురి మధ్య పెద్ద సీన్ జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో యూపీలోని బృందావన్‌లో చోటు చేసుకుంది. బృందావన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ఫోన్‌లో మరో వ్యక్తితో రొమాంటిక్ చాటింగ్, ఫోన్ మాట్లాడటం గమనించాడు. తరవాత కొద్దిరోజుల పాటు భార్యపై నిఘాపెట్టగా ఆమె ప్రియుడిని కలుసుకునేందుకు గెస్ట్ హౌస్ వెళుతున్నట్టు తెలిసింది. వెంటనే తన స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లగా రెడ్ హ్యాండెడ్‌గా భార్యను ప్రియుడితో పట్టుకున్నాడు.
మొదట స్నేహితులతో కలిసి భార్య ప్రియుడిని చితకబాదగా అతడి షర్ట్ చిరిగిపోయింది. అతడి స్నేహితులే కాకుండా స్థానికులు సైతం అతడిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. అనంతరం తన భార్యతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె కూడా అతడిని కొట్టే ప్రయత్నం చేసింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఒకరినొకరు కొట్టుకున్నారు. భార్యను కొడుతూ భర్త తీవ్ర ఆవేదనతో నీ వల్ల నా జీవితం నాశంనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 5ఏళ్లపాటు నరకం చూపించావని అన్నాడు. నువ్వు నన్ను మోసం చేయడం సరికాదని, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం ఆ మహిళపై మండిపడుతున్నారు. video






