- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదేళ్ల కొడుకుని వదిలి కజిన్ సిస్టర్‌తో భార్య రొమాన్స్.. వాట్సాప్ చాటింగ్ చూసి బిత్తరపోయిన భర్త
అశుతోష్, సంధ్యలకు ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు చదువు నిమిత్తం

దిశ, వెబ్‌డెస్క్: భర్త కజిన్ సిస్టర్ తో భార్య చేసిన రొమాంటిక్ వాట్సప్ చాటింగ్ ను చూసి ఓ కుటుంబం అవాక్కైంది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ పరారైన తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. ప్రేమకు లింగ వివక్ష లేదని చెప్తూ.. ఇలా ఒకే జెండర్ కు చెందిన ఇద్దరు రొమాన్స్ చేయడం పరిపాటిగా మారింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశుతోష్, సంధ్యలకు ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు చదువు నిమిత్తం అశుతోష్.. తన భార్య, పిల్లాడితో కలిసి జబల్పూర్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడికి సమీపంలోనే ఉంటోన్న కజిన్ మాన్సి తరచూ ఇంటికి వస్తూ, వెళ్తూ ఉండేది. సంధ్య, మాన్సిలు ఎంతో క్లోజ్ గా ఉండటం చూసినా అశుతోష్ కు ఎలాంటి అనుమానం రాలేదు. వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారనుకున్నాడు. తరచూ విహారయాత్రలకు, షాపింగులకు వెళ్తున్నా.. సందేహించలేదు.
ఈ ఏడాది ఆగస్టు 12న సంధ్య ఇల్లు వదిలి వెళ్లిపోగా.. అశుతోష్ ఆమెకోసం వెతికాడు. జబల్పూర్ రైల్వే స్టేషన్లో కన్పించడంతో ఇంటికి తీసుకువచ్చాడు. కొద్దిరోజులు బాగానే ఉన్న సంధ్య ఆగస్టు 22న మళ్లీ భర్త ఇంట్లో లేని సమయంలో కొడుకుని వదిలి వెళ్లిపోయింది. ఈసారి మొబైల్ ఫోన్ ను కూడా ఇంట్లోనే వదిలేయడంతో సంధ్య ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోనే ఉన్న సంధ్య ఫోన్ ను ఎందుకో చెక్ చేయడంతో.. మాన్సితో ఆమె జరిపిన రొమాంటిక్ చాటింగ్ చూసి బిత్తరపోయాడు. అప్పుడే మాన్సితోనే సంధ్య పరారై ఉంటుందని అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘంపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. స్థానికులకు విషయం తెలియడంతో ఇదెక్కడి విడ్డూరం అంటూ గుసగుసలాడుకోవడం, అశుతోష్ ను రకరకాల ప్రశ్నలు అడుగుతుండటంతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.






