- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయోలో ప్రియుడితో భార్య.. పిల్లలతో వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. అర్ధనగ్నంగా గోడపై, తుప్పల్లో..
ఓ భార్య తన ప్రియుడితో ఓయో రూమ్‌కి వెళ్లగా.. ఆమె ఉన్న ప్లేస్‌ను తెలుసుకున్న భర్త.. తమ పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భర్త వచ్చిన విషయం తెలుసుకున్న ఆమె..

దిశ, వెబ్‌డెస్క్: భార్య భర్తల బంధాన్ని నమ్మాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు చూస్తున్న యువత పెళ్లంటేనే మాకొద్దు బాబోయ్ అని పారిపోతున్నారు. కలకాలం కలిసి ఉంటామని, ఒకరినొకరు మోసం చేసుకోమని చేసుకున్న ప్రమాణాలు మరిచి, బాధ్యతలను గాలికి వదిలేసి బరితెగించి మరీ పడకసుఖం కోసం నచ్చినవారితో వెళ్లిపోతున్నారు. భర్త కరెక్ట్‌గా ఉంటే భార్య ఉండట్లేదు, భార్య కరెక్ట్‌గా ఉంటే భర్త మోసం చేస్తున్నాడు. ఇద్దరిలో ఎవరో ఒకరు తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నారు.
తాజాగా ఓ భార్య తన ప్రియుడితో ఓయో రూమ్‌కి వెళ్లగా.. ఆమె ఉన్న ప్లేస్‌ను తెలుసుకున్న భర్త.. తమ పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భర్త వచ్చిన విషయం తెలుసుకున్న ఆమె.. అర్థనగ్నంగానే గోడ దూకి.. ఉరుకులు, పరుగులతో తుప్పల్లో నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ది ఒరిజినల్ ఫైల్స్ అనే ఇన్ స్టా పేజిలో పోస్ట్ అయిన ఈ వీడియోలో మీరట్ లో ఈ ఘటన జరిగినట్లుగా చూపించారు. ఓ నెటిజన్ ఇప్పుడు భర్త అలిమోనీ ఇవ్వడానికి సిద్ధమవ్వాలి. ఎందుకంటే ఆమె కోర్టులో కేసు వేస్తే.. జడ్జి భర్తకే శిక్ష వేస్తాడు అని కామెంట్ చేశారు. ఇంకొకరు ఆమె పిల్లలు ఆమెలా అవ్వకూడదని కామెంట్ చేశారు. తాత్కాలిక శారీరక సుఖం కోసం కుటుంబ విలువలు, బాధ్యతలను పణంగా పెట్టి బరితెగిస్తున్న ఇలాంటి వారికి బుద్ధి వచ్చేలా చట్టాలు తీసుకురావాలని ఇంకొక నెటిజన్ అన్నారు.






