పెళ్లి మండపంలోనే భర్తను చెప్పుతో కొట్టిన భార్య

by Muthe.Rajitha |

పెళ్లి మండపంలో అతిధులు అందరూ చూస్తుండగానే భర్తను గొడ్డును బాదినట్టు బాదింది ఓ భార్య.

పెళ్లి మండపంలోనే భర్తను చెప్పుతో కొట్టిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి మండపంలో అతిధులు అందరూ చూస్తుండగానే భర్తను గొడ్డును బాదినట్టు బాదింది ఓ భార్య. అంతేకాదు ఆమె తల్లిదండ్రుల వర్గం అందరితో కలిసి చెప్పులతో కొట్టారు. ముందుగా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పెళ్ళికి వచ్చిన బంధువులు ఆశ్చర్యపోగా.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. ఇంతకీ వారు షాక్ అయిన అసలు విషయం వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిత్రదుర్గ్ కు చెందిన కార్తీక రెండేళ్ల క్రితం తనూజను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత అదనపు కట్నం కోసం తనూజను వేధించిన కార్తీక్ ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టి మరో పెళ్ళికి సిద్ధం అయ్యాడు.

తీరా ఆ రెండో పెళ్లి జరుగుతుండగా.. విషయం తెలుసుకున్న తనూజ ఆమె తల్లిదండ్రులు పెళ్లి మండపానికి చేరుకొని, కార్తీక్ కు దేహశుద్ధి చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో చివరికి గొడవ సద్దుమణిగింది.

Next Story