కోర్టులోనే భర్తను చితకొట్టిన భార్య.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-19 16:29:42  IST  )

ఈ మ‌ధ్య భ‌ర్త‌ల‌పై దారుణాలు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. అక్ర‌మ సంబంధాలు, పెళ్లికి ముందే ల‌వ్ ఎఫైర్స్ లాంటి అనేక కార‌ణాల‌తో చాలా మంది త‌మ భ‌ర్త‌ల‌ను హ‌త‌మారుస్తూ

కోర్టులోనే భర్తను చితకొట్టిన భార్య.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య భ‌ర్త‌ల‌పై దారుణాలు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. అక్ర‌మ సంబంధాలు, పెళ్లికి ముందే ల‌వ్ ఎఫైర్స్ లాంటి అనేక కార‌ణాల‌తో చాలా మంది త‌మ భ‌ర్త‌ల‌ను హ‌త‌మారుస్తూ వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. దీంతో మ‌గ‌వారిపై దారుణాలు పెరిగిపోయాయ‌ని, మ‌గ‌వాళ్ల కోసం ప్ర‌త్యేక చ‌ట్టాలు కూడా తీసుకురావాలి అని అనేక డిమాండ్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో భార్య భ‌ర్త‌ను చిత‌క‌బాదిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న బంగ్లాదేశ్లోని హాల్వేలో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఓ హాస్పిటల్ లో భార్య భ‌ర్త‌ను చిత‌క‌బాదింది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు జర‌గ్గా అవి కాస్తా విడాకుల వ‌ర‌కు వెళ్లాయి. ఈ క్ర‌మంలో భార్య భ‌ర్త ప‌నిచేస్తున్న ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు వెళ్లి అత‌డిపై దాడి చేసింది. ఆస్ప‌త్రి హాలులో అందరి ముందే అత‌డి జుట్టు లాగుతూ పైకి ఎగిరి తన్నుతూ రెచ్చిపోయింది. అయితే మ‌హిళ భ‌ర్త‌పై దాడి చేస్తున్న‌ప్పుడు ప‌క్క‌న ఉన్న‌వాళ్లు ఆమెను ఆప‌కుండా న‌వ్వ‌డం వీడియోలో క‌నిపిస్తుంది. మ‌హిళ కొడుతుంటే ఆమె భ‌ర్త కూడా నవ్వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఈ వీడియోను షోని క‌పూర్ అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌గా ..పెళ్లి అంటే భ‌య‌మే ఇలాంటి భార్య దొరికితే అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక ఈ వీడియోకు నెటిజ‌న్లు త‌మ స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. video

Next Story