సమోసాలు తీసుకురాలేదని భర్త, మామను చితకబాదిన మహిళ.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

యూపీలోని పిలిభిత్ పురాన్‌పూర్ ప్రాంతానికి చెందిన సంగీత తన భర్త శివంను వేడి వేడి సమోసాలు తీసుకురావాలని గత కొద్దిరోజులుగా కోరుతుంది. కానీ అతడు మాత్రం పట్టించుకోవడంలేదు. ఆగస్టు 30న కూడా భర్తకు ఫోన్ చేసి సమోసాలు తీసుకురావాలని కోరగా అతడు తీసుకురాలేదు. దీంతో దంపతులు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

సమోసాలు తీసుకురాలేదని భర్త, మామను చితకబాదిన మహిళ.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: సమోసాలు తీసుకురాలేదని ఓ మహిళ భర్త, మామను చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీలోని పిలిభిత్ పురాన్‌పూర్ ప్రాంతానికి చెందిన సంగీత తన భర్త శివంను వేడి వేడి సమోసాలు తీసుకురావాలని గత కొద్దిరోజులుగా కోరుతుంది. కానీ అతడు మాత్రం పట్టించుకోవడంలేదు. ఆగస్టు 30న కూడా భర్తకు ఫోన్ చేసి సమోసాలు తీసుకురావాలని కోరగా అతడు తీసుకురాలేదు. దీంతో దంపతులు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

అది కాస్తా పెద్దది కావడంతో తన తల్లి దండ్రులను సైతం ఇంటికి పిలిపించుకుంది. ఇరువురి మధ్య పంచాయితీ జరగ్గా మాట్లాడుతున్న సమయంలోనే భర్తపై దాడి చేసింది. అతడితో పాటు మామ విజయ్ కుమార్ ను సైతం కాలితో తన్నుతూ, బెల్టుతో చితకబాదింది. సంగీతతో కలిసి ఆమె తల్లి దండ్రులు కూడా దాడి చేశారు. ఈ ఘటనపై సంగీత మామ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన కోడలు తన కొడుకుతో పాటు తనపై దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమోసా తీసుకురాలేదు అనే కారణంతోనే ఆగ్రహంతో ఊగిపోయి గొడవ పెట్టుకుందని తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో సమోసాల కోసమే ఇంతలా దాడి చేయాలా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. video

Next Story