బ్యాంక్ మేనేజర్‌పై భార్య దాడి

by Sujitha Rachapalli |

బ్యాంక్ మేనేజర్‌ను దారుణంగా కొట్టింది భార్య. బ్యాంక్ సిబ్బందిలో ఓ అమ్మాయితో ఎపైర్ పెట్టుకున్నాడని ఆరోపిస్తూ చితగ్గొట్టింది. బ్యాంక్ నుంచి బయటకు రాగానే సోదరులు, బంధువులతో కలిసి దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్

బ్యాంక్ మేనేజర్‌పై భార్య దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : బ్యాంక్ మేనేజర్‌ను దారుణంగా కొట్టింది భార్య. బ్యాంక్ సిబ్బందిలో ఓ అమ్మాయితో ఎపైర్ పెట్టుకున్నాడని ఆరోపిస్తూ చితగ్గొట్టింది. బ్యాంక్ నుంచి బయటకు రాగానే సోదరులు, బంధువులతో కలిసి దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. ధీరేంద్ర సింగ్ పాల్.. ఉత్తరప్రదేశ్‌ బిసౌలీలోని హోలీ చౌక్‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్ రీజినల్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి జరిగి ఎనిమిదేళ్లు కాగా రెండు నెలల కూతురు ఉంది. ఈ ఘటన జరిగాక భార్య.. భర్త ఎఫైర్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురు ఉన్నా ఇలాంటి పని చేస్తున్నాడని.. ఎన్నిసార్లు చెప్పినా మానుకోవడం లేదని తెలిపింది. బ్యాంక్ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నప్పుడు నిలదీస్తే.. తనను దారుణంగా కొట్టాడని చెప్పింది. తాను డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లాక మితిమీరిపోయారని చెప్పింది. వారు కలిసి తిరుగుతున్న వీడియోలు, చాట్ హిస్టరీ సమర్పించింది. ఓ వీడియోలో మేనేజర్ తన భార్యను వదిలించుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. మరోవైపు భర్త కూడా తనపై భార్య దాడి చేసిందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు.

Next Story