సిలిండర్లకు ఆ రంధ్రాలు ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే

by velandi.Saikiran |

సిలిండ‌ర్ కింద‌ రంధ్రాలు ఉండడం వెనుక రహస్యమే ఉంది. సిలిండర్ నిలబెట్టినప్పుడు దాని కింద కచ్చితంగా వెంటిలేషన్ ఉండాలి.

సిలిండర్లకు ఆ రంధ్రాలు ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ యుద్ధం కారణంగా ఇండియా వ్యాప్తంగా LPG కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. యుద్ధం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఎల్పీజీ మన దేశానికి వస్తోంది. హర్మూజ్ జల సంధి గుండా మన ఇండియాకు సంబంధించిన నౌకలను ఇరాన్ వదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు గ్యాస్ సిలిండర్ కింద ఫోటోలో చూపించినట్లు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? వాటి ప్రయోజనం ఏంటని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు.

అయితే సిలిండ‌ర్ కింద‌ రంధ్రాలు ఉండడం వెనుక పెద్ద రహస్యమే ఉంది. గ్యాస్ సిలిండర్ నిలబెట్టినప్పుడు దాని కింద కచ్చితంగా వెంటిలేషన్ ఉండాలి. వెంటిలేషన్ ఉంటేనే గ్యాస్ సిలిండర్ కింద గాలి ప్ర‌యా ణిస్తుంది. అలా రంధ్రాల గుండా గాలి ప్రవహిస్తేనే, సిలిండర్ త్వరగా పాడవకుండా.. ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే ఇంట్లో పెట్టిన గ్యాస్ సిలిండర్ కిందకు నీళ్లు వెళ్లడం మనం గమనిస్తాం. అలా నీళ్లు వెళ్లడం వల్ల సిలిండర్ కింద తుప్పు పట్టి, పనికి రాకుండా పోతుంది. అయితే ఈ రంధ్రాల ద్వారా గాలి వేగంగా ప‌య‌నించి, నీటి తేమను అరికడుతుంది. దీని ద్వారా తుప్పుకు చెక్ పెట్టవచ్చు. అందుకే ప్రతి సిలిండర్ కింద రంధ్రాలు ఏర్పాటు చేస్తారు.

Next Story