- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Unlimited Biryani: బిర్యానీ లవర్స్‌కి బంపరాఫర్.. కేవలం రూ.10 లకే తిన్నంత బిర్యానీ.. ఎక్కడంటే?
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.

దిశ, వెబ్ డెస్క్: బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. బిర్యానీ (Biryani) పేరు చెబితేనే లొట్టలేసుకుంటూ మరీ తినేందుకు వచ్చేస్తారు. అయితే ఏ హోటల్‌కు, రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ ధర ఎంత తక్కువ అనుకున్న రూ.200 ఉంటుంది. పైగా ఈ రోజుల్లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో బిర్యానీ ధర కూడా అమాంతం పెరిగిపోతుంది. అలాంటిది కేవలం రూ.10 లకే తిన్నంత బిర్యానీ అంటే పండగే కదా. నమ్మకలేకపోతున్నారు కదు. కానీ, నిజమేనండి.. ఓ హోటల్ నిర్వాహకులు బిర్యానీ లవర్స్ కోసం ఈ బంపరాఫర్ ప్రకటించారు. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడుందో తెలుసుకుందామా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని (Andhrapradesh) తూర్పు గోదావరి జిల్లా విరవల్లి టోల్ ప్లాజా (Viravalli Tollplaza) వద్ద అన్‌లిమిటెడ్ హోటల్ ఉంది. ఈ హోటల్ నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ స్పెషల్ ఆఫర్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం రూ.10లకే తిన్నంత బిర్యానీ అని ప్రకటించారు. ఇక ఇది చూసిన జనం హోటల్‌కు బారులు తీరారు. నిర్వాహకులు ఊహించని స్థాయిలో బిర్యానీ ప్రియులు ఎగబడడంతో గంటలోనే బిర్యానీ గిన్నెలు ఖాళీ అయ్యాయి. రోజుకూలీ చేసుకునేవారు, పనివాళ్లతో పాటు విద్యార్ధులు సైతం బిర్యానీ కోసం ఎగబడ్డారు. అంతేకాకుండా టోల్‌ప్లాజా వద్ద ఆగిన వాహనదారులు కూడా ఈ ఆఫర్ విషయం తెలుసుకుని హోటల్‌కు వచ్చారు. దీంతో హోటల్‌కు భారీగా తాకిడి ఏర్పడింది. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందని హోటల్ నిర్వాహకులు తెలపలేదు.






