- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏంటీ భయ్యా! 3bhk అద్దె నెలకు రూ.2.7 లక్షలా? సెక్యూరిటీ డిపాటిట్‌కి లోన్ తీసుకోవాల్సిందే!
మన దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో ఇళ్ల అద్దె ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ (Metropolitan) సిటీల్లో ఇళ్ల అద్దె ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. చిన్న 1BHK ఇంటికైనా నెలకు రూ.20-30 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా నార్మల్ లోకేషన్‌లో అయితేనే.. కాస్తా సెంట్రల్ ఏరియా, ఆఫీసులకు దగ్గరల్లో ఉండేలా చూసుకుంటే సగానికి పైగా సాలరీ అద్దె (House rent) చెల్లించేందుకే పోతుంది. ఇలాంటి షాకింగ్ అద్దె ధరలకు సంబంధించిన వార్తలు నెట్టింట నిత్యం వైరల్ (Viral) అవ్వటం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే, ఇప్పుడు చెప్పబోయే వార్త మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి షాక్‌కు గురిచేస్తోంది. ఎందుకంటే.. ఈసారి అద్దె వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లోకి చేరింది. ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారిన ఈ వార్త గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బెంగళూరులోని (Bangalore) హర్లూర్ ప్రాంతంలో అద్దెకు ఉండేందుకు ఇళ్లు కోసం ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుండగా రెడ్డిట్‌లో ఒక ప్రకటన కనిపించింది. 3BHK అపార్టుమెంట్‌కు నెలకు కేటాయించిన అద్దె చూసి సదరు వ్యక్తి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఎందుకంటే.. 1,464 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.2లక్షల 70 వేలు అద్దెతో పాటు రూ. 15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ప్రకటనలో ఉంది. ఈ విషయాన్ని వెంటనే సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? లేక బెంగళూరులోని ప్రజలు అధికంగా రెంట్స్ పే చేస్తున్నారా? అంటూ సదరు వ్యక్తి ప్రశ్నించాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. 'సదరు యజమాని రెంట్ విషయంలో పొరపాటున ఒక సున్నా ఎక్కువగా పెట్టాడేమో' అని కొందరు, 'ఇంత అద్దె కట్టాలంటే లోన్ తీసుకోవాల్సిందే' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అందులో పేర్కొన్న అద్దె వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్న వాటి కంటే చాలా ఎక్కువగా ఉందని, ఇదొక ఫేక్ పోస్టు అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటన మరోసారి బెంగళూరులో నివాస భద్రత ఎంత ఖర్చుతో కూడుకున్నదో, మధ్య తరగతి కోసం హౌసింగ్ ఎంత గందరగోళంగా మారిందో స్పష్టంగా చూపించింది.






