- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఆయా షేర్' హవా మామూలుగా లేదు.. సూపర్ రికార్డు వైపు పరుగులు
'ది ప్యారడైజ్' చిత్రంలోని 'ఆయా షేర్' సాంగ్ యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'. ఖయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి కొంతకాలం క్రితం విడుదలైన 'ఆయా షేర్' మాస్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. విడుదలైన కొద్ది గంటల్లోనే భారీ ఆదరణ పొందిన ఈ పాట, ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.






