నడుమందాలతో నెటిజన్లను ఫిదా చేస్తున్న మౌనీ రాయ్.. గ్లామర్ డోస్ మామూలుగా లేదు

by Pulgam srinivas |

పలుచటి చీరలో పరువాల విందు.. మౌని రాయ్ అందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు

నడుమందాలతో నెటిజన్లను ఫిదా చేస్తున్న మౌనీ రాయ్.. గ్లామర్ డోస్ మామూలుగా లేదు
X

దిశ, వెబ్ డెస్క్: హిందీ అందాల తార మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు టెలివిజన్ సీరియల్స్‌తో బుల్లితెరపై స్టార్‌డమ్ అందుకున్న ఈ భామ, ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.




నటనతో పాటు తన గ్లామర్‌తోనూ ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా నిలుస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా స్టైలిష్ ఫొటోషూట్‌లతో అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకునే మౌని రాయ్, తాజాగా మరోసారి తన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కించింది.




లైట్ గ్రీన్ రంగు పలుచటి చీరకు గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో మెరిసే మెరూన్ బ్లౌజ్‌ను జత చేసి ఆమె ఇచ్చిన ఫోజులు చూపరులను కట్టిపడేస్తున్నాయి.




నడుమందాలు హైలైట్ అయ్యేలా విభిన్న కోణాల్లో స్టిల్స్ ఇస్తూ తన గ్లామర్‌ను మరింత ఎలివేట్ చేసింది. చెవులకు భారీ ఇయర్‌రింగ్స్, నుదిటిపై చిన్న బొట్టు, విరబోసిన కురులతో మౌని రాయ్ మరింత మంత్రముగ్ధం చేసేలా కనిపించింది.




ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల నుంచి భారీగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story