- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలుడు మృతి
జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ వద్దకు తీసుకు వస్తే నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.

దిశ, మరిపెడ: జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ వద్దకు తీసుకు వస్తే నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పురుషోత్తమయ్యా గూడెం గ్రామానికి చెందిన బల్గూరి సురేష్ రేణుక దంపతులు మండల కేంద్రంలో నివాసం ఉంటూ స్థానికంగా ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం చిన్న కుమారుడు బల్గూరి నాని(3)కి సుస్తి చేయడంతో స్థానికంగా రాజీవ్ గాంధీ సెంటర్లో ఉన్న ఆర్ఎంపీ రవి వద్దకు ప్రథమ చికిత్సకు తీసుకెళ్లారు.
బాలుడికి జ్వరం వచ్చిందని ఇంజక్షన్స్ వేస్తే తక్కువ అవుతుందని శనివారం, ఆదివారం రెండు రోజులు ఇంజక్షన్లు వేసి సిరప్‌లు ఇచ్చినట్లు బాధిత తండ్రి తెలిపారు. ఆదివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు మరోసారి రవి డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లారు. ఆయాసం తగ్గేందుకు ఓ సిరప్ ఇచ్చి వేయమని చెప్పగా ఆర్ఎంపీ చెప్పినట్లే తల్లిదండ్రులు చేశారు. అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలుడు ఉలుకు పలుకు లేకుండా ఉండడం స్థానికంగా ఉన్న మరో వైద్యుడికి చూపించగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ఎంపి రవి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయడని తనకు న్యాయం చేయాలని తండ్రి సురేష్ కోరుతున్నాడు.






