ప్రభుత్వ పాఠశాలలో చోరీ

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే వంట పత్రాలు చోరీ జరిగిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

ప్రభుత్వ పాఠశాలలో చోరీ
X

దిశ, బొమ్మలరామరం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే వంట పత్రాలు చోరీ జరిగిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పాఠశాల ఇంచార్జ్ హెచ్ ఎం రవీందర్ తెలిపిన ప్రకారం.. శనివారం మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు పంపిణీ చేసిన తర్వాత పాత్రలు వంట గదిలో పెట్టి వంట సిబ్బంది గదికి తాళం వేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం వంట సిబ్బంది వంట గదికి వెళ్లి చూడగా వంటగది తాళం విరగగొట్టి ఉన్నది. గదిలోకి వంటపాత్రలు అన్ని చివరికి తినే ప్లేట్లతో సహా గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దొంగతనంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా మూడు సార్లు దొంగతనం జరిగిందని పాఠశాలకు నైట్ వాచ్ మెన్ ను కేటాయించాలని కోరారు.

Next Story