పార్లమెంట్‌కు చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి.. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం

by Malleboina Mahesh |

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ కు "ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్" అంటూ నినాదాలతో ఎన్డీయే ఎంపీలు స్వాగతం పలికారు.

పార్లమెంట్‌కు చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి.. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ వివాదం, సీజేపీ, విద్యార్థులు భారీ నిరసనలు హింసాత్మకంగా మారడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా తర్వాత మాజీ మంత్రిగా ప్రధాన్ ఈ రోజు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌కు వచ్చిన ఆయనకు బీజేపీ, ఎన్డీఏ (NDA) కూటమికి చెందిన ఎంపీలు ఘన స్వాగతం పలికారు. పరీక్షల సంస్కరణలు, నూతన చట్టంపై పార్లమెంట్‌లో చర్చ జరగనున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యత సంతరించుకుంది.

ధర్మేంద్ర ప్రధాన్ లోపలికి వస్తున్న సమయంలో ఎన్డీఏ ఎంపీలు పెద్ద ఎత్తున "ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్" (Dharmendra Pradhan Zindabad)అంటూ నినాదాలు చేశారు. తోటి ఎంపీల నినాదాల నడుమ ఆయన చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలోకి వెళ్లారు. విద్యార్థుల ప్రయోజనాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై ప్రభుత్వం చేపడుతున్న చర్యల నేపథ్యంలో అధికార పక్ష ఎంపీల ఈ నినాదాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Next Story