సీఎం చంద్రబాబుతో భోజనం చేసిన విద్యార్థిని.. అనూహ్యంగా ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

మూడు రోజుల క్రితం తల్లికి వందనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడి పక్కనే కూర్చుని, ఆయనతో మాట్లాడి, ఆయనే సెల్ఫీ తీసుకున్న టెన్త్ విద్యార్థిని శివాని.. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది.

సీఎం చంద్రబాబుతో భోజనం చేసిన విద్యార్థిని.. అనూహ్యంగా ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రోజుల క్రితం తల్లికి వందనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడి పక్కనే కూర్చుని, ఆయనతో మాట్లాడి, ఆయనే సెల్ఫీ తీసుకున్న టెన్త్ విద్యార్థిని శివాని.. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. పోలవరం జిల్లా ఇర్లపల్లికి చెందిన శివాని ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. షైనింగ్ స్టార్ అవుతానని చెప్పిన శివాని.. ఇలా తన జీవితాన్ని ముగించడం ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. సూసైడ్ కు ముందు ఆ విద్యార్థిని రాసిన నోట్ కన్నీళ్లు పెట్టిస్తోంది.

"సారీ అమ్మా.. నాకోసం చాలా కష్టపడ్డావ్. డాడీ.. నీ కల నెరవేర్చలేకపోతున్నా. నా డ్రీమ్ కూడా ఫుల్ ఫిల్ చేయలేకపోతున్నా. అమ్మా నాన్న నాకు బ్రతకాలని ఉంది కానీ.. బ్రతకడానికి చాలా రిగ్రేట్ గా ఉంది. చాలా గిల్టీగా కూడా ఉంది. అమ్మ నీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా. నేను చనిపోయాక నాపై కోప్పడకండి నాన్న. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మా.. మీరు ఇప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి. అన్నయ్య ఇకనైనా నాన్న మాట విని బాగుపడు.. చెడ్డపనులు చేయకు." అని శివానీ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ చేస్తున్నారు.

Next Story