HYD: యశోదా హాస్పిటల్‌కు కేసీఆర్

by Gantepaka Srikanth |

గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రికి రానున్నారు.

HYD: యశోదా హాస్పిటల్‌కు కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రికి రానున్నారు. ఆదివారం హన్మకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే స్థానిక రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం, మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల బృందం వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తోంది.

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మొదటినుంచీ నిరంతరం ఆరా తీస్తున్న కేసీఆర్.. ఆయనకు అత్యుత్తమ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను ఇప్పటికే ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు యశోద ఆసుపత్రికి చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అక్కడ ఉన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు.

Next Story