- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Jakkula.Mamatha |
జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారిపై మరో దారుణం చోటుచేసుకుంది.

X
దిశ, కల్వకుర్తి: జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారిపై మరో దారుణం చోటుచేసుకుంది. ఒక ప్రమాదం మరవకముందే మరో ప్రమాదం జరిగి మృతి చెందిన ఘటన కల్వకుర్తి మండల పరిధిలో వెలుగుచూసింది. మండల పరిధిలోని మార్చాల గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున లింగసానిపల్లి గ్రామానికి చెందిన బొందల భగవంత్ (27)ను గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోకి తరలించి కుటుంభ సభ్యులకు సమాచారం అందజేసినట్లు కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పరిసర ప్రాంతాల్లోని సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు.
Next Story






