- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. చర్చనీయాంశంగా మారిన మలైకా అరోరా కొత్త బాయ్ ఫ్రెండ్!
52 ఏళ్ల మలైకా, తనకంటే 19 ఏళ్లు చిన్నవాడైన హర్ష్ మెహతాతో డేటింగ్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సినిమాల కంటే ప్రేయ వ్యవహారాల కారణంగానే సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో సుదీర్ఘ బంధానికి స్వస్తి చెప్పిన తర్వాత, ఆమె లైఫ్‌లోకి మరో కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చారనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. మలైకా ప్రముఖ డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ముంబైలోని బాంద్రాలో జరిగిన ఒక గ్రాండ్ ప్రైవేట్ పార్టీకి మలైకా తన కొడుకు అర్హాన్ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. అదే పార్టీలో హర్ష్ మెహతా కూడా సందడి చేయడంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వచ్చే రూమర్లకు మరింత బలం చేకూరింది. 52 ఏళ్ల మలైకా, తనకంటే 19 ఏళ్లు చిన్నవాడైన హర్ష్ మెహతాతో డేటింగ్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో తనకంటే 12 ఏళ్లు చిన్నవాడు అర్జున్ కపూర్ విషయంలో ఎదుర్కొన్న విమర్శల తరహాలోనే, ఇప్పుడు కూడా నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.






